Tilak Varma becomes youngest Player to score half century for Mumbai Indians in IPL: ఐపీఎల్ 2022లో తెలుగు యువ ఆటగాడు తిలక్ వర్మ అద్భుత హాఫ్ సెంచరీ బాదాడు. శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో 33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61 రన్స్ చేశాడు. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ హైదరాబాద్ క్రికెటర్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో అరంగేట్రం చేసి ఆకట్టుకోగా రెండో మ్యాచులోనే సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు కష్టాల్లో ఉన్నపుడు క్రీజులోకి వచ్చిన తిలక్.. అద్భుత ఆటతో ఐపీఎల్‌ కెరీర్‌లో తొలి అర్ధ సెంచరీని నమోదు చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

40 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ముంబైని ఇషాన్ కిషన్‌తో కలిసి తిలక్‌ వర్మ ఆదుకున్నాడు. ఇషాన్ ఆచితూచి ఆడినా.. తిలక్ బౌండరీల వర్షం కురిపించాడు. రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడుతూ 28 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తిలక్.. ఆపై మరింత ధాటిగా ఆడాడు. అయితే ఆర్ అశ్విన్‌ వేసిన అద్భుత బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కిషన్‌తో కలిసి మూడో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తిలక్.. జట్టను విజయం దిశగా నడిపించాడు. అయితే మిగతా వారు ఆకట్టుకోకపోవడంతో ముంబై 23 పరుగుల తేడాతో ఓడిపోయింది.



రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగులు చేయడంతో తిలక్‌ వర్మ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ముంబై ఇండియన్స్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ చేసిన అతి పిన్న ఆటగాడిగా తిలక్‌ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌పై ఉంది. ఇషాన్ 19 సంవత్సరాల 278 రోజులకు హాఫ్ సెంచరీ బాదాడు. తిలక్‌ 19 సంవత్సరాల 145 రోజులకు అర్ధ శతకం చేశాడు. 2018 సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌పై ఇషాన్ 58 పరుగులు చేయగా..అదే రాయల్స్‌పై తిలక్‌ 61 రన్స్ బాదాడు. 


Also Read: Ugadi 2022: ఉగాది నాడు ముస్లిం భక్తులతో కిటకిటలాడుతున్న వేంకటేశ్వరస్వామి ఆలయం.. ఎక్కడో తెలుసా


Also Read: MI vs RR: బట్లర్ సెంచరీ, తిప్పేసిన అశ్విన్.. ముంబైపై రాజస్థాన్ ఘన విజయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.