Mithali Raj announces retirement from international cricket: హైద‌రాబాదీ క్రికెట్ ప్లేయ‌ర్, భారత మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తాను త‌ప్పుకుంటున్న‌ట్లు వెల్లడించారు. కొదిసేపటి క్రితం (బుధవారం జూన్ 8) మిథాలీ సోషల్ మీడియా హ్యాండిల్‌ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. మిథాలీ సుమారు 23 ఏళ్ల పాటు భారత జ‌ట్టు త‌ర‌పున ఆడారు. ఇన్నేళ్లు జట్టుకు నాయకత్వం వహించడం ఎంతో గౌరవంగా ఉందని, ఈ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథాలీ రాజ్ తన ట్విట్టర్ ఖాతాలో భావోద్వేగ నోట్‌ షేర్‌ చేశారు. 'భారత జట్టు జెర్సీలో దేశానికి ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. చాలా సంతోషంగా ఉంది. నా క్రికెట్ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపళ్లాలు ఎదుర్కొన్నా. 23 ఏళ్లుగా ప్రతి సవాలును ఎదుర్కొంటూ జీవితంలో ఎంతో అనుభవం గడించా. ప్రతి ప్రయాణానికి ఏదో ఒకరోజు ముగింపు ఉంటుంది. ఈరోజు నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నాను. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నా' అని పేర్కొన్నారు.


'క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. భారత జ‌ట్టు త‌ర‌పున ఇన్నేళ్లు ఆడడం ఆనందంగా ఉంది. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే ప్రయత్నించా. ప్రతి మ్యాచులో జట్టును గెలిపించాలని చూసేదాన్ని. ఇప్పుడు ఆటకు వీడ్కోలు పలికే సమయం వచ్చింది. ఎంతో మంది ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు జట్టులోకి రావాలి. భారత మహిళా క్రికెట్‌.. భవిష్యత్తులో మరింతగా  వెలిగిపోవాలి. బీసీసీఐ, సహచరులు, నాకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు' అని మిథాలీ రాజ్ చెప్పారు. జీవితంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టాలనుకుంటున్నానని, ఇలాగే తనపై ప్రేమను కురిపిస్తూ అండగా నిలవాలని కోరారు.  


1999లో 16 ఏళ్ల వ‌య‌సులో వ‌న్డేల్లో అరంగేట్రం చేసిన మిథాలీ రాజ్.. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే శతకం బాదారు. అదే 19 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 214 పరుగులు చేసి.. టెస్టుల్లో 200 పరుగులు చేసిన పిన్న వయస్కురాలిగా అరుదైన గుర్తింపు సాధించారు. వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన మ‌హిళా క్రికెట‌ర్‌గా ఆమె పేరిట రికార్డు ఉంది. వన్డేల్లో 7 వరుస హాఫ్ సెంచరీలు, 4 ప్రపంచకప్‌లలో కెప్టెన్సీ లాంటి ఎన్నో రికార్డులు మిథాలీ పేరుపై ఉన్నాయి. 



23 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో మిథాలీ రాజ్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టారు. మిథాలీ భారత్ తరఫున 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20లు ఆడారు. టెస్టులలో 669, వన్డేలలో 7805, టీ20లలో 2364 పరుగులు చేశారు. మొత్తంగా మిథాలీ 8 సెంచరీలు చేశారు. 7 సెంచరీలు వన్డేల్లో చేయగా.. ఒకటి టెస్టులో బాదారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు (10,686) మిథాలీదే. 39 ఏళ్ల మిథాలీ జీవితంలో 30 సంవత్సరాలు క్రికెట్టే ఉంది. 


Also Read: Virat Kohli Record: విరాట్‌ కోహ్లీ అరుదైన ఘనత.. ఏకైక క్రికెటర్‌గా రేర్ రికార్డు!


Also Read: TS High Court: కరోనా పరీక్షలను పెంచండి..తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి