4 Wickets In An Over: ఒక ఓవర్లో 4 వికెట్లు తీసుకున్న గ్రేట్ బౌలర్లు
4 Wickets In An Over: ఒక ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు తీయడం అనేదే ఒక గొప్ప విషయం. అలాంటింది కొంతమంది ఆటగాళ్లు మూడు కాదు.. ఏకంగా నాలుగు వికెట్లు కూడా తీసి సూపర్ బౌలర్స్ అనిపించుకున్నారు. అందులోనూ హ్యాట్రిక్ చేసిన వాళ్లున్నారు. ఆ జాబితా ఏంటో ఓ లుక్కేద్దాం రండి.
4 Wickets In An Over: ఒక ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు తీయడం అనేదే ఒక గొప్ప విషయం. అలాంటింది కొంతమంది ఆటగాళ్లు మూడు కాదు.. ఏకంగా నాలుగు వికెట్లు కూడా తీసి సూపర్ బౌలర్స్ అనిపించుకున్నారు. అందులోనూ హ్యాట్రిక్ చేసిన వాళ్లున్నారు. ఆ జాబితా ఏంటో ఓ లుక్కేద్దాం రండి.
మొహమ్మద్ సిరాజ్ :
ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ మొహమ్మద్ సిరాజ్ శ్రీలంకను ఆటగాళ్లను చీల్చిచెండాడాడు. ఒకే ఓవర్లో మూడు కాదు.. నాలుగు కాదు ఏకంగా ఆరు వికెట్లు తీసుకుని లంక ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. అంతేకాకుండా ఒకే ఓవర్లో 6 వికెట్లు తీసిన ఆటగాడిగా అరుదైన రికార్డు సాధించి చరిత్ర సృష్టించాడు.
లసిత్ మలింగ :
శ్రీలంక స్పీడ్ బౌలర్ లసిత్ మలింగ 2007 వరల్డ్ కప్ సందర్భంగా ఒకే ఓవర్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. వరుసగా నాలుగు బంతుల్లో షాన్ పొల్లాక్, ఆండ్రూ హాల్, జాకుస్ కల్లిస్, మఖాయ ఎంటినిలను పెవిలియన్‌కి పంపించి హ్యాట్రిక్‌తో పాటే ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన బౌలర్ గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.
టీ20 ఇంటర్నేషనల్ డెత్ ఓవర్ హీరో జేసన్ హోల్డర్ :
2022 లో వెస్టిండీస్ vs ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ బౌలర్ జేసన్ హోల్డర్ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టి డెత్ ఓవర్ బౌలింగ్ హీరో అనిపించుకున్నాడు. జేసన్ బౌలింగ్ ఆ మ్యాచ్ లో జట్టుకు విజయాన్ని అందించింది.
2022 ఐపిఎల్ టోర్నీలో కోల్‌కతా నైట్ రైడర్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీశాడు. ఇందులో ఓ హ్యాట్రిక్ కూడా ఉంది. ఆ మ్యాచ్‌లో చాహల్ బౌలింగ్ రాజస్థాన్ జట్టుకు విజయాన్ని అందించింది.
ఆండ్రూ రసెల్ :
2013 లో వెస్టిండీస్ , ఇండియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో విండీస్ బౌలర్ ఆండ్రూ రసెల్ బౌలింగ్ లో టీమిండియా ఆటగాళ్లు యువరాజ్ సింగ్, నమన్ ఓజా, కేదార్ జాదవ్, యూసుఫ్ పటాన్ తమ వికెట్లు లాస్ అయ్యారు. ఇది టీ20 లిస్ట్ A రికార్డు.
అల్ - అమిన్ హుసేన్ :
2023 లో యూసీబీ-బీసీబీ vs అబహని లిమిటెడ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో యూసీబీ-బీసీబీ బౌలర్ అల్ - అమిన్ హూసేన్ తన బౌలింగ్ లో 5 వికెట్లు తీసుకున్నాడు.
ఆల్ఫాన్సో థామస్ :
2014 లో జరిగిన కౌంటీ చాంపియన్‌షిప్ పోటీల్లో సోమర్సెట్ జట్టు బౌలర్ ఆల్ఫాన్సో థామస్ వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసుకుని సస్సెక్స్ జట్టు నడ్డి విరిచాడు.
ఇది కూడా చదవండి : Ind vs SL: సిరాజ్ దెబ్బకు శ్రీలంక విలవిల, అరుదైన రికార్డులు సాదించిన హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్
1996 లో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బౌలర్ కెవన్ జేమ్స్ నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు.
2000 లో సర్రీ, డెర్బిషైర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వరుసగా నాలుగు బంతులకు నాలుగు వికెట్లు తీసి హ్యాట్రిక్ కూడా సాధించాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది కూడా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి ఈ అరుదైన క్లబ్‌లో చేరాడు.
ఇది కూడా చదవండి : IND Vs SL Highlights: ఇదేక్కడి మాస్ విక్టరీ మావా.. టీమిండియా దెబ్బకు కుదేలైన లంకేయులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి