Ind vs SL: సిరాజ్ దెబ్బకు శ్రీలంక విలవిల, అరుదైన రికార్డులు సాదించిన హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్

Ind vs SL: హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ మొహమ్మద్ సిరాజ్ చెలరేగిపోయాడు. ఆసియా కప్ ఫైనల్‌లో నిప్పులు కురిపించే బంతులతో శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. అరుదైన రికార్డు తన సొంతం చేసుకున్నాడు. సిరాజ్ రికార్డు వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 17, 2023, 06:59 PM IST
Ind vs SL: సిరాజ్ దెబ్బకు శ్రీలంక విలవిల, అరుదైన రికార్డులు సాదించిన హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్

Ind vs SL: ఇండియా వర్సెస్ శ్రీలంక ఆసియా కప్ ఫైనల్‌లో టీమ్ ఇండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఆసియా కప్ చేజిక్కించుకుంది. నిప్పులు కురిపించే పేస్‌తో శ్రీలంక బ్యాటర్లను మట్టికరిపించిన మొహమ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్‌లో భారీ విధ్వంసమే సృష్టించాడు.

గతంలో ఎన్నడూ చూడని మ్యాచ్. ఆసియా కప్ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ముచ్చెమటలు పట్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 7 ఓవర్లలో కేవలం 21 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అటు బూమ్రా, హార్దిక్ పాండ్యా కూడా వికెట్లు తీయడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. వన్డే టోర్నీ పైనల్‌లో శ్రీలంకకు ఇదే అత్యల్ప స్కోర్. 

మొహమ్మద్ సిరాజ్ అరుదైన రికార్డులు

శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో మొహమ్మద్ సిరాజ్ ఒకే ఓవర్‌లో 4 వికెట్లు పడగొట్టడమే కాకుండా 10 బంతుల వ్యవధిలో 5 వికెట్లు సాధించడం అరుదైన రికార్డ్. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇండియా తరపున సింగిల్ స్పెల్‌లో అత్యంత వేగంగా 5 వికెట్లు పూర్తి చేసిన తొలి బౌలర్ అయ్యాడు. గతంలో శ్రీలంక దిగ్గజం చమిండా వాస్ 16 బంతుల్లో 5 వికెట్లు సాధించాడు. సిరాజ్ ఆ రికార్డు సమం చేశాడు. 

ఈ మ్యాచ్‌లో మొహమ్మద్ సిరాజ్ రెండవ ఓవర్‌లో 4 వికెట్లతో వన్డే క్రికెట్ లో 50 వికెట్లు పూర్తి చేశాడు. వన్డే చరిత్రలో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయుడు, ప్రపంచంలో రెండవవాడు. వన్డే ఫార్మట్‌లో ఈ ఫీట్ సాధించేందుకు అంటే 50 వికెట్లు తీసేందుకు సిరాజ్..1002 బంతులు వేశాడు. గతంలో శ్రీలంక స్పిన్ బౌలర్ అజంతా మెండిస్ 847 బంతుల్లో 50 వికెట్లు సాదించి మొదటి స్థానంలో నిలిచాడు. 

ఒకే ఓవర్‌లో 4 వికెట్లు సాధించిన తొలి భారతీయ బౌలర్‌గా రికార్డ్ సాధించాడు. వన్డేల్లో 2002 తరువాత మొదటి 10 ఓవర్లలో 5 వికెట్లు పడగొట్టిన తొలి భారత్ పేసర్‌గా మొహమ్మద్ సిరాజ్ మరో రికార్డు సాధించాడు. అంతకుముందు 2003లో శ్రీలంకపై జనగల్ శ్రీనాథ్ మొదటి 10 ఓవర్లలో 4 వికెట్లు తీయగా 2013లో శ్రీలంకపై భుననేశ్వర్ కుమార్ 4 వికెట్లు, 2022లో బూమ్రా 4 వికెట్లు పడగొట్టారు. 

Also read: IND Vs SL Asia Cup 2023: ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు.. నిప్పులు చెరిగిన సిరాజ్.. తోకమూడిచిన శ్రీలంక బ్యాట్స్‌మెన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News