Mohammed Siraj: `టీ20 వరల్డ్ కప్ ఆడటం నా కల...అయితే సెలక్ట్ కానంత మాత్రాన అంతా ముగిసిపోయినట్టు కాదు`...
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ టీ20 ప్రపంచకప్ పై స్పందించాడు. తాను ఎంపిక కానుందుకు బాధగా ఉందని..అయితే ఒక్కసారి జట్టులో స్థానం దక్కకనంత మాత్రాన అంతా ముగిసిపోయినట్లు కాదని పేర్కొన్నాడు.
Mohammed Siraj: టీ20 ప్రపంచకప్ ఆడాలన్నది తన కల అని టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) తమ మనసులోని మాటను బయటపెట్టాడు. అయితే, జట్టులో స్థానం పొందలేకపోవడం నిరాశకు గురిచేసిందని పేర్కొన్నాడు. ఏదేమైనా టీమిండియా తరఫున ఆడటం గొప్ప విషయమని, జట్టును గెలిపించడంలో తన పాత్ర పోషించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పాడు. కాగా అక్టోబరు 17 నుంచి ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్(T20 World Cup)నకు బీసీసీఐ(BCCI) ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో ఈ హైదరాబాదీకి చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే.
అనుభవజ్ఞులైన పేస్ త్రయం జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌కే సెలక్షన్ కమిటీ ఓటు వేసింది. దీంతో సిరాజ్‌కు నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో స్టార్‌స్పోర్ట్స్(Star Sports)తో మాట్లాడిన సిరాజ్.. జట్టులో స్థానం దక్కకపోవడం బాధించిందన్నాడు. టీ20 వరల్డ్ కప్ ఆడాలనేది నా కల. కానీ, సెలక్షన్ అనేది మన చేతిలో ఉండదు కదా. ఒక్కసారి జట్టులో స్థానం దక్కకనంత మాత్రాన అంతా ముగిసిపోయినట్లు కాదు. నా ముందు పెద్ద లక్ష్యం ఉంది. టీమిండియా విజయాల్లో నాదైన పాత్ర పోషించాలని భావిస్తున్నా. విధిరాతను నేను నమ్ముతాను. నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు నా వంతు కృషి చేస్తా’’ అని చెప్పుకొచ్చాడు.
Also Read: Kohli step down from t20 captain: కోహ్లీ సంచలన నిర్ణయం.. టీ20 కెప్టెన్సీకి గుడ్ బై
ఇక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(Syed Mustaq Ali Trophy) నేపథ్యంలో హైదరాబాద్(Hyderabad) తరఫున ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సిరాజ్ ఈ సందర్భంగా చెప్పాడు. ‘‘దేశవాళీ క్రికెట్‌లోనూ నా జట్టు తరఫున కీలక పాత్ర పోషించాలనేది నా కల. అయితే, ఎలైట్ గ్రూప్ ఆఫ్ రంజీ ట్రోఫీలో మా జట్టు లేకపోవడం నిరాశకు గురిచేసింది. టీ20 టోర్నీకి మాత్రం అందుబాటులో ఉంటాను’’అని స్పష్టం చేశాడు. హనుమ విహారి(Hanuma Vihari) హైదరాబాద్ జట్టుకు తిరిగి ఆడనుండటం శుభ పరిణామమని సిరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా... ఆస్ట్రేలియా టూర్‌లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన 27 ఏళ్ల సిరాజ్.. ఇప్పటి వరకు తొమ్మిది టెస్టులాడి 30 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఐపీఎల్(IPL)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ప్రస్తుతం యూఏఈలో ఉన్నాడు.
టీ20 ప్రపంచకప్ భారత జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.
స్టాండ్ బై ప్లేయర్స్: శ్రేయస్ అయ్యార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహార్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి