Mohammed Siraj replaces Jasprit Bumrah for India vs South Africa T20I series: వెన్ను గాయంతో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌ 2022కి  దూరమైన విషయం తెలిసిందే.  బుమ్రా స్థానంలో హైదరాబాద్‌ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎంపిక చేసింది. సఫారీలతో టీ20 సిరీస్‌ తదుపరి మ్యాచ్‌లకు అతడిని ఎంపిక చేసినట్లు ప్రకటించింది. దాంతో దక్షిణాఫ్రికాతో జరుగనున్న చివరి రెండు మ్యాచ్‌లకు సిరాజ్‌ అందుబాటులో ఉండనున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీలంకతో స్వదేశంలో చివరి సారిగా సిరాజ్‌ భారత్ తరఫున టీ20 మ్యాచ్‌ ఆడాడు. ఫిబ్రవరిలో ధర్మశాల వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల బౌలింగ్‌ చేసి.. 22 పరుగులు ఇచ్చి ఓ వికెట్‌ తీశాడు. ఆగష్టులో జింబాబ్వే పర్యటనలో భాగంగా చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో 8 ఓవర్లు బౌలింగ్‌ చేసి 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు. ఆ తర్వాత సిరాజ్‌కు భారత జట్టులో చోటు దక్కలేదు. ఇప్పుడు బుమ్రా గాయపడడంతో సిరాజ్‌కు జట్టులో చోటు దక్కింది. 



గాయం కారణంగా ఆసియా కప్‌ 2022 టీ20 టోర్నీకి జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో  పునరాగమనం చేశాడు. రెండు, మూడో టీ20లలో ఆడాడు. గాయం తిరగబెట్టడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టీ20లో అతడు ఆడలేదు. తొలి టీ20 టాస్‌కు కొద్ది నిమిషాల ముందు బుమ్రా గాయం గురించి బీసీసీఐ వెల్లడించింది.ఇక  గాయం కారణంగా కీలక టీ20 ప్రపంచకప్‌ 2022కు దూరమయ్యాడు. ఇప్పటికే మోకాలి గాయం వల్ల ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మెగా టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. 


Also Read: AP TET Results 2022: ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండి ఇలా...


Also Read: Munugode Voters: కేసీఆర్ ను నిన్న పొట్టుపొట్టు తిట్టింది.. నేడు జై కొట్టింది.. మునుగోడులో నేతలే కాదు ఓటర్లది యూటర్నే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook