T20 World Cup 2024 Updates:  టీ20 వరల్డ్ కప్ సమయం దగ్గర పడుతోంది. జట్లన్నీ తమ అస్త్రలన్నింటినీ సిద్దం చేస్తున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం భారత్ కూడా రెడీ అవుతుంది. ప్రస్తుతం ఆటగాళ్లు అందరూ ఐపీఎల్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు అయితే ఇందులో కొందరు రాణిస్తుంటే.. మరికొందరు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. వీరంతా ప్రపంచకప్ కు ముందు ఫామ్ లోకి రావాలని బీసీసీఐ భావిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆందోళనకు గురిచేస్తున్న ఆ ఇద్దరూ..
ఐపీఎల్ లో బ్యాటర్లు అంతా బాగానే రాణిస్తున్నారు. అయితే బౌలర్ల ఫామ్ మాత్రం మేనేజ్మెంట్ కు కొత్త తలనొప్పిని తెచ్చుపెడుతుంది.  జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లు ప్రపంచ కప్‌లో ముగ్గురు ప్రధాన ఫాస్ట్ బౌలర్‌లుగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇందులో బుమ్రా మంచి ఫామ్ లో ఉండగా.. మిగతా ఇద్దరూ మాత్రం వికెట్లు తీయడానికి నానా కష్టాలు పడుతున్నారు. ఈ ఐపీఎల్ లో వీరిద్దరి ప్రదర్శన దారుణంగా ఉంది. ఈ ముగ్గురు పేసర్లు ఐపీఎల్ గణాంకాలు ఒకసారి పరిశీలిద్దాం. 


ఐపీఎల్‌లో ముంబై ఇండియన్ తరపున ఆడుతున్న జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచులు ఆడిన బుమ్రా 13 వికెట్లు తీశాడు. అతడి ఎకానమీ రేటు  6.37గా ఉంది. మరో పేసర్ మహ్మద్ సిరాజ్ అయితే ఈ ఐపీఎల్ లో దారుణంగా విఫలమయ్యాడు.  7 మ్యాచ్‌లు ఆడిన ఈ హైదరాబాద్ పేసర్ కేవలం 5 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అంతేకాకుండా ఇతడు 10.34 ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చాడు. ఇతడు వరల్డ్ కప్ కు ముందు తన లయను అందిపుచ్చుకోవాల్సి ఉంది. 


మరోవైపు పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్న అర్ష్‌దీప్ సింగ్ 8 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఇతడు 9.40 ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకున్నాడు. సిరాజ్, అర్ష్‌దీప్‌ సింగ్‌ పామ్ కోల్పోవడం టీమ్‌ఇండియాకు ఆందోళన కలిగించే విషయం. మెగా టోర్నీకి ముందు వీరిద్దరూ ఫామ్ లోకి రావాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. 


Also read: Kavya Maran: సన్‌రైజర్స్‌ ఘోర పరాజయం.. వైరల్ అవుతున్న కావ్య మారన్‌ రియాక్షన్‌..


Also Read: RCB vs SRH Highlights: ఏం జరిగింది? సన్‌రైజర్స్‌కు భారీ షాక్‌.. హైదరాబాద్‌ను బెంబేలెత్తించిన బెంగళూరు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook