Indian T20 League: ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌ 2022 ఫైనల్‌ మ్యాచ్‌ అరుదైన ఘనతను అందుకుంది. గత మే 29వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్‌ టైటాన్స్, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ను తిలకించేందుకు దాదాపు 1,01,566 మంది వచ్చారు. దీంతో ఈ మ్యాచ్ టీ20 క్రికెట్ చరిత్రలో ప్రత్యక్షంగా అత్యధిక మంది వీక్షించిన మ్యాచ్‌గా గిన్నీస్‌ రికార్డు (Guinness World Record) సృష్టించింది. ఈ విషయాన్ని  బీసీసీఐ సెక్రెటరీ జై షా ఆదివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.  ఇది గర్వించదగ్గ విషయమని.. ఈ ఘనత సాధించడంలో సపోర్టుగా నిలిచిన అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 15వ ఎడిషన్ పైనల్ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. మెుదట బ్యాటింగ్ చేసిన సంజూ శాంసన్ నాయకత్వంలోని రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి 130 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన హార్దిక్ సేన 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తొలి  సీజన్‌లోనే గుజరాత్ టైటిల్ ను గెలుచుకుంది. ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా హార్ధిక్ పాండ్యా నిలిచాడు.



అయితే గతంలో ఈ రికార్డు మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ పేరిట ఉండేది. తాజాగా ఆ రికార్డును మన ఇండియా బద్దలు కొట్టింది. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ సామర్థ్యం 1,00,024ల మంది కాగా.. నరేంద్ర మోదీ స్టేడియం సామర్థం దాదాపు 1,10,000లుగా ఉంది. అంటే మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ కంటే దాదాపు 10వేల మంది ఎక్కువ అన్నమాట.


Also Read: MS Dhoni Dance: ఎంఎస్ ధోనీ అదిరే స్టెప్పులు.. పబ్‌లో రచ్చ రంబోల! ఎవరితోనో తెలుసా 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.