MS Dhoni Dance: ఎంఎస్ ధోనీ అదిరే స్టెప్పులు.. పబ్‌లో రచ్చ రంబోల! ఎవరితోనో తెలుసా

MS Dhoni Dance hit song Kala Chashma song in Dubai. పబ్‌లో ర్యాపర్ బాద్‌షా పాట పాడుతుంటే.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ  డాన్స్ చేశాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 27, 2022, 05:43 PM IST
  • ఎంఎస్ ధోనీ అదిరే స్టెప్పులు
  • పబ్‌లో రచ్చ రంబోల
  • ఎవరితోనో తెలుసా
MS Dhoni Dance: ఎంఎస్ ధోనీ అదిరే స్టెప్పులు.. పబ్‌లో రచ్చ రంబోల! ఎవరితోనో తెలుసా

MS Dhoni shaking a leg with Hardik Pandya to Badshah tunes in Dubai: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఎంత కామ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాచ్ రసవత్తరంగా ఉన్నా.. ఓడిపోయే పరిస్థితి ఉన్నా.. గెలిచినా ఒకేలా ఉంటాడు. అందుకే ధోనీకి 'మిస్టర్ కూల్' అనే ట్యాగ్ ఉంది. పెద్ద పెద్ద టోర్నీలు గెలిచినా మహీ పెద్దగా సందడి చేయడు. ఇక డాన్స్ చేసిన సందర్భాలు అయితే చాలా అరుదు. అయితే రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ధోనీ.. తాజాగా ఓ పబ్‌లో డాన్స్ చేశారు. పబ్‌లో టీమిండియా ఆటగాళ్లు అందరూ కలిసి రచ్చ రంబోల చేశారు. 

తాజాగా ఎంఎస్ ధోనీ దుబాయ్‌లో తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు. పుట్టినరోజు వేడుకలు పబ్‌లో ఘనంగా జరిగాయి. ఈ పార్టీకి ధోనీ సహా టీమిండియా యువ ప్లేయర్స్ హర్హిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, ఇషాన్ కిషన్‌లు హాజరయ్యారు. పబ్‌లో ర్యాపర్ బాద్‌షా పాట పాడుతుంటే.. హార్ధిక్, కృనాల్, ఇషాన్‌ల మీద చేతులేసి మహీ డాన్స్ చేశాడు. గుండ్రంగా తిరుగుతూ కాళ్లతో స్టెప్పులు వేశారు. అందరూ ఆగినా కూడా ధోనీ మాత్రం తన కాళ్లను కదుపుతూనే ఉన్నాడు. మహీ మంచి స్టైలిస్‌ లూక్‌లో కనిపించాడు.

ఎంఎస్ ధోనీ స్టెప్పులకు సంబంధించిన వీడియోను ఆయన భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ధోనీ డ్యాన్స్‌ను చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన మహీ.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2023 సీజన్ కోసం అతడు సిద్దమవుతున్నాడు. ఈ సీజన్ తర్వాత ధోనీ ఐపీఎల్ ఆటకు కూడా వీడ్కోలు పలికి.. చెన్నై జట్టుకు మెంటర్‌గా మారబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఐపీఎల్ 2022 ఆరంభంలో ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో.. రవీంద్ర జడేజా పగ్గాలు అందుకున్నాడు. 8 మ్యాచులు ముగిసిన తర్వాత చెన్నై యాజమాన్యం మళ్లీ కెప్టెన్‌ని మార్చింది. జడేజా స్థానంలో ధోనీ మరోసారి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. మొత్తంగా చెన్నై 14 మ్యాచుల్లో 10 పరాజయాలు, నాలుగు విజయాలతో సరిపెట్టుకుని పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. అందుకే ఈసారి బలంగా తిరిగి రావాలని చూస్తోంది. 

Also Read: Sanju Samson: సంజూ శాంసన్ మంచి మనసు.. రెండో వన్డే మ్యాచ్‌ ఆడకున్నా సాయం! వీడియో వైరల్‌  

Also Read: Sanju Samson: ఆ ఒక్క కారణంగానే.. సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోలేదు: శిఖర్ ధావన్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.

 

Trending News