భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనిని టీమిండియా కోచ్ రవిశాస్త్రి కొనియాడారు. ఆయన వయసు 36 ఏళ్లయినా.. ఆయనకు ఇంకా ఆట బాగా ఆడే సామర్థ్యముందని తెలిపారు. ‘మనం మూర్ఖుల వలే ఆలోచించకూడదు! 40 ఏళ్లుగా క్రికెట్ చూస్తున్నా. విరాట్‌ కూడా చాలా రోజుల నుండీ జట్టులో ఉన్నాడు. అయితే ఈ వయసులో కూడా ధోనీ తన కంటే చిన్నవారిపై కూడా బాగా రాణిస్తున్నాడు. వారితో పోటీ  పడుతున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధోనిపై విమర్శలు చేస్తున్న వారు క్రికెట్‌ గురించి మర్చిపోయారేమో. అలాంటి వారు తమకు 36 సంవత్సరాలు వచ్చినప్పుడు ఏం చేశారో ఆలోచించాలి.. తమను తాము ప్రశ్నించుకోవాలి. వారేమైనా ఆ వయసులో సరిగ్గా పరుగులు తీశారా.. వారి కంటే ధోని ఎన్నోరెట్లు బెస్ట్ . ధోని 51 సగటుతో దేశానికి రెండు ప్రపంచకప్‌లు అందించాడు. వన్డేల్లో అతని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు’ అని రవిశాస్త్రి అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:


'ధోని-కోహ్లీ' రెస్టారెంట్ ఎక్కడుందో తెలుసా?


కేరళ ఆలయానికి 'ముఖ్య అతిథి' గా ధోనీ కుమార్తె జీవా