MS Dhoni can be appointed as Team India T20I Coach and Director: తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్ 2022 సెమీ ఫైనల్‌లో భారత్ దారుణ ఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై 10వికెట్ల తేడాతో ఓడి ఇంటిదారి పట్టింది. ఈసారి ఎలాగైనా కప్పు కొడుతుందని అనుకున్న భారత్.. నాకౌట్ మ్యాచ్‌లో చేతులెత్తేయడంతో అభిమానులతో పాటు మాజీలు కూడా షాక్ అయ్యారు. 2011లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో చివరగా భారత్ ప్రపంచకప్ గెలిచింది. ఇప్పటికీ 11 సంవత్సరాలు పూర్తయినా టీమిండియా ఖాతాలో ఇంకో ప్రపంచకప్ చేరలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐసీసీ ఈవెంట్లలో భారత్ వైఫల్యాలు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని ఆందోళనకు గురిచేస్తోంది. 2023లో వన్డే ప్రపంచకప్, 2024లో టీ20 ప్రపంచకప్ ఉంది. ఈ మెగా టోర్నీలలో అయినా భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు బీసీసీఐ ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలెట్టిందని సమాచారం. భారత్ మెరుగైన ప్రదర్శన కోసం రెండు ప్రపంచకప్‌లను గెలిచిన ఎంఎస్ ధోనీని రంగంలోకి దించబోతోందని 'ది టెలిగ్రాఫ్' తమ నివేదికలో పేర్కొంది. 


భారత క్రికెట్‌లో శాశ్వత పాత్ర కోసం ఎంఎస్ ధోనీని నియమించాలని బీసీసీఐ బోర్డు యోచిస్తోందని సమాచారం. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు మూడు ఫార్మాట్‌లలో బాధ్యతలు నిర్వహించడం చాలా కష్టమవుంటోందని బీసీసీఐ భావిస్తోంది. అందుకే కోచ్ పాత్రలను విభజించాలని బీసీసీఐ యోచిస్తోంది. టీ20 ఫార్మాట్‌లో ధోనీని నియమించేందుకు బోర్డు ఆసక్తిని కనబర్చుతోందట. అంతేకాదు భారత క్రికెట్ జట్టు స్థాయిని పెంచడానికి మహీ నైపుణ్యాలను ఉపయోగించుకోవాలని చూస్తోందట. 


టీ20 ఫార్మాట్‌లో కోచ్ పాత్ర మాత్రమే కాకూండా టీమిండియా డైరెక్టర్‌గా కూడా ఎంఎస్ ధోనీని నియమించాలని బీసీసీఐ కసరత్తులు చేస్తోందని తెలుస్తోంది. ఈ నెలాఖరులో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం గురించి బీసీసీఐ పెద్దలు చర్చించనున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే.. ఐపీఎల్‌కు ధోనీ రిటైర్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో మహీ ఆడడు. యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2021 సమయంలో మహీ భారత జట్టుతో కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. మొత్తానికి ధోనీ అనుభవాన్ని మరియు సాంకేతిక చతురతను వాడుకోవాలని బీసీసీఐ చూస్తోంది. 


Also Read: Rohit Sharma: రోహిత్ శర్మ స్థానంలో ఎవరు..? ఈ ముగ్గురు ఆటగాళ్ల నుంచి పోటీ  


Also Read: Budh Ka Gochar 2022: ఒకే రాశిలో 3 గ్రహాలు.. ఈ నెల నుంచి ఆ రాశువారికి ఊహించని డబ్బే..డబ్బు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook