రిటైర్డ్‌మెంట్ పై రియాక్ట్ అయిన ధోనీ ...ఎప్పుడంటే ?
వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఇప్పటికే పలువురు సీనియర్ క్రికెటర్లు తన రిటైర్డ్ మెంట్ ను ప్రకటించారు.
వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఇప్పటికే పలువురు సీనియర్ క్రికెటర్లు తన రిటైర్డ్ మెంట్ ను ప్రకటించారు. ఈ క్రమంలో విండీస్ స్టార్ బ్యాట్స్ మెన్స్ క్రిస్ గేల్, పాక్ బ్యాట్స్ మెన్స్ సోయబ్ మలిక్, సౌతాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్, భారత మిడిల్ బ్యాట్స్ మెన్ అంబటి రాయుడు లాంటి సీనియర్ ఆటగాళ్లు రిటైర్డ్‌మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ధోని పై పడింది. ఇదే టోర్నీలో తన నిదానపు ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటున్న ధోనీ సైతం వీడ్కోలు పలకనున్నాడని వార్తలు వస్తుండంతో ఎంఎస్ ధోనీ వాటిని స్పందించాడు.
మాజీలకు ధోనీ చురకలు
ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ తన రిటైర్డ్ మెంట్ పై వస్తున్న కథనాలు వార్తలు గాలి వార్తలేనని కొట్టేపడేశాడు. తాను ఎప్పుడు రిటైర్ అవుతానో తనకే తెలియదని దాట వేత ధోరణిని ప్రదర్శించాడు. తన రిటైర్డ్ మెంట్ పై చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని..అలా ఎందుకు చేస్తున్నారో వారినే అడగాలని మాజీ క్రికెటర్లకు ధోనీ చురుకలు అంటించారు. ఈ క్రమంలో ధోనీ మాట్లాడుతూ కానీ కొంతమంది తాను శ్రీలంకతో మ్యాచ్ కి ముందే రిటైర్ మెంట్ ప్రకటించాలని కోరుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశాడు.
సంచలన ప్రకటన ఉంటుందా ?
అయితే ఈ విషయానైనా గోప్యంగా ఉంచి సంచలన ప్రకటన చేయడం ధోనీ నైజం..టెస్టు క్రికెట్ నుంచి వైదొలినప్పుడు కూడా ఇదే ధోరిణి ప్రదర్శించాడు ధోనీ. మరి జనాలు అనుకుంటున్నట్లుగా ధోనీ రిటైర్డ్ మెంట్ ప్రకటిస్తాడా లేదా మరికొంతకాలం జట్టులో కొనసాగుతాడా అనేది దానిపై ఉత్కంఠ నెలకొంది