Dhoni Retirement: ఎంఎస్ ధోనీ కెరీర్ ఎలా మొదలైందో అలాగే ముగిసింది
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కెరీర్ ఎలా మొదలైందో అలాగే ముగిసింది. క్రికెట్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ధోనీ స్వాతంత్ర దినోత్సవం రోజున తన అభిమానులకు షాకిస్తూ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కెరీర్‌లో తొలి, చివరి మ్యాచ్‌లలో రనౌట్ (MS Dhoni Run Out) అయిన క్రికెటర్‌గా ధోనీ నిలిచాడు.
క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni Retirement) అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడం తెలిసిందే. భారత జట్టుకు టీ20 వరల్డ్ కప్(2007), వన్డే వరల్డ్ కప్ (2011), ఛాంపియన్స్ ట్రోఫీ (2013) అందించిన కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ అరుదైన ఘనత సాధించాడు. కెరీర్‌లో ఈ మూడింటిని ఓ జట్టుకు అందించిన ఏకైక అంతర్జాతీయ కెప్టెన్ ధోనీ (MS Dhoni)నే కావడం గమనార్హం. Sourav Ganguly: ధోనీ రిటైర్మెంట్ గురించి దాదా ఏమన్నాడంటే..
అయితే మహీ తన కెరీర్‌ను ఎలా మొదలుపెట్టాడో అలాగే ముగించాడు. 2004లో డిసెంబర్ 23న చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో ధోనీ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో ధోనీ రనౌట్ (MS Dhoni Run Out In First Match) కావడం తెలిసిందే. తన కెరీర్ చివరి మ్యాచ్‌లోనూ ధోనీ రనౌట్‌గా వికెట్ సమర్పించుకోవడం గమనార్హం. MS Dhoni ఆ విషయాన్ని ముందే చెప్పాడు: యువరాజ్ సింగ్
2019లో న్యూజిలాండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌లో అనవసర పరుగు కోసం యత్నించి ధోనీ రనౌట్ (MS Dhoni Run Out In Last Match) అయ్యాడు. ఆ తర్వాత జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో బీసీసీఐ కాంట్రాక్ట్ కూడా కోల్పోయాడు. ఆగస్టు 15న వన్డేలు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో కెరీర్‌లో తొలి, చివరి మ్యాచ్‌లు రనౌట్ అయిన క్రికెటర్‌గా నిలిచాడు ధోనీ. ప్రపంచంలోనే అత్యుత్తమ అథ్లెట్, క్రికెటర్లలో ఫాస్టెస్ట్ రన్నర్ అయిన ధోనీ కెరీర్‌లో తొలి, చివరి మ్యాచ్‌లలో వెనుదిరగడం గమనార్హం. అందాలతో బుసలు కొడుతున్న ‘నాగిని’ Nia Sharma Hot Photos
Photos: అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..