ధోనికి వచ్చిన ప్రశంసలు ఒక ఎత్తు.. ఇదొక ఎత్తు!
ధోనికి వచ్చిన ప్రశంసలు ఒక ఎత్తు.. ఇదొక ఎత్తు!
ప్రపంచవ్యాప్తంగా వున్న క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ ఎంతో మంది ధోనికి ఎన్నోసార్లు, ఎన్నో విధాల కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అందుకే ధోని కెరీర్‌లో రికార్డులకు, ప్రశంసలకు కొదువ లేదు. అయితే, తాజాగా టీమిండియా ఫీల్డింగ్ కోచ్ రామకృష్ణన్ శ్రీధర్.. అదేనండి మనందరం షార్ట్‌కట్‌లో ఆర్ శ్రీధర్ అని పిలుచుకుంటామే.. ఆయన ఇచ్చిన మరో ప్రశంస మాత్రం మమూలు ప్రశంస కాదు!
ఎం.ఎస్. ధోని వికెట్ కీపింగ్ విధానం గురించి తాజాగా శ్రీధర్ మాట్లాడుతూ.. "సాధారణంగా శిక్షణ శిబిరాల్లో అంత సీరియస్‌గా ప్రాక్టీస్ చేసినట్టు కనిపించని ధోనీ.. ఆటలో మాత్రం అద్భుతమైన కీపింగ్ చేస్తాడు. ధోనీ కీపింగ్ స్టైలే వేరు. ఆ స్టైల్ ఆయనకి మాత్రమే సొంతం. ఇంకా చెప్పాలంటే కేవలం ధోనీ వికెట్ కీపింగ్ స్టైల్ గురించి మనం ఒక అధ్యయనం కూడా చేయొచ్చు. ఆ అధ్యయనాన్ని తానైతే ది మహీ వే అని పిలుస్తాను" అని ధోనీ వికెట్ కీపింగ్ స్టైల్ గురించి గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఇలాంటి ప్రశంసలు అందుకోవడం ధోనికి ఇదేం కొత్త కాదు. ధోనీతో క్రికెట్ ఆడిన ఇతర దేశాల కెప్టేన్స్ ఎంతోమంది ధోని సింప్లిసిటీని, ప్రతిభను ఆకాశానికెత్తిన సందర్భాలెన్నో!!