Rape Threat to Virat Kohli Daughter- Hyderabad man Arrested: దుబాయ్ (Dubai) వేదికగా జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ (T-20 World Cup 2021) లో దాయాది దేశమైన పాకిస్తాన్ (Pakistan)తో టీమీండియా (Team India) మొదటి మ్యాచ్ లో ఓడిన సంగతి మన అందరికీ తెలిసిందే.. అయితే అభిమానులు ఈ నిజాన్ని జీరించుకోలేక టీమిండియాపై మీమ్స్, జోక్స్ తో రెచ్చిపోయిన సంగతి కూడా తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ ట్విట్టర్ లో "క్రీక్ క్రేజీ గర్ల్" (Crick Carzy Girl) పేరుతో అకౌంట్ నుండి అసభ్యమైన పోస్ట్ వచ్చింది. అదేంటంటే.. పాకిస్తాన్ తో మ్యాచ్ ఓడిన అనంతరం విరాట్ కోహ్లీ (Virat Kohli) కుమార్తెను (Vamika) రేప్ చేస్తానంటూ పోస్ట్ చేశారు. అయితే దీనిపై అభిమానులే కాదు యావత్ భారత్ పోస్ట్ పెట్టిన యువకుడిని కఠినంగా శిక్షించాలని కోరగా.. క్షణాల్లో ఈ ట్వీట్ వైరల్ అవ్వటంతో ట్విట్టర్ యాజమాన్యం ఆ పోస్ట్ ను వెంటనే తొలగించింది. 


Also Read: Chandra Grahanam 2021: నవంబర్ 19న కార్తీక పౌర్ణమి.. ఆ రోజే చివరి చంద్ర గ్రహణం.. ఆ రాశిపై ప్రభావం!


అప్పటికే ఇది వైరల్ అవ్వగా.. ఈ ట్వీట్ పై కేసు నమోదు చేసిన ముంబాయి (Mimbai Police) మరియు ఢిల్లీ పోలీసులు (Delhi Police) దర్యాప్తు ప్రారంభించారు. ఈ పోస్ట్ పెట్టింది మన హైదరాబాద్ (HYderabad) కు చెందిన రామ్ నగేష్ (Ram Nagesh) ఈ ట్వీట్ చేసాడని ఆధారాలు సేకరించారు. నిందితుడు రామ్ నగేష్ ను బుధవారం ఉదయం సంగారెడ్డి జిల్లాలో (Sangareddy District) కంది మండలం ఎద్దు మైలారం అనే గ్రామంలో ఉన్న ఆయుధ కర్మాగారం క్వార్ట్రర్స్ లో పోలీసులు  అరెస్ట్ చేశారు. 




ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తీ చేసిన 23 ఏళ్ల రామ్ నగేష్ కొంత కాలంగా ఫుడ్ డెలివరీ యాప్ (Food Delivery App) లో పనిచేస్తున్నట్లు పోలీసులుగుర్తించారు. రామ్ నగేష్ తండ్రి ఆయుధ కర్మాగారంలో ఒక ఉద్యోగి.. క్వార్ట్రర్స్ లోనే నిందితుడుకిని అరెస్ట్ చేసిన వెంటనే తల్లి తండ్రులు తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయారు. 


Also Read: Special Video from Ghani: ఆకట్టుకుంటున్న 'గని' సినిమా స్పెషల్ వీడియో.. ఈ నెల 15న టీజర్..!!


పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో  భారత్ ఓడిన వెంటనే ఈ ట్వీట్ చేయగా అది వైరల్ అవ్వటంతో.. నిందితుడిని ఊరి తీయాలని అభిమానులు చాలా మంది రీ-ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook