Chandra Grahanam 2021: నవంబర్ 19న కార్తీక పౌర్ణమి.. ఆ రోజే చివరి చంద్ర గ్రహణం.. ఆ రాశిపై ప్రభావం!

ఈ సంవత్సరపు చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ 19 న కార్తీక పౌర్ణమి పండుగ రోజున రాబోతుంది. ఈ గ్రహణం కొన్ని రాశులపైన ఎక్కువ ప్రభావం చూపనుంది.. ఆ రాశులు ఏంటంటే.. ??  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 11, 2021, 12:55 PM IST
  • 'మే నెలలో' వచ్చిన ఈ సంవత్సరపు మొదటి చంద్ర గ్రహణం
  • నవంబర్ 19 న రానున్న కార్తీక పౌర్ణమి పండుగ
  • ఈ పండుగ రోజు ఈ సంవత్సరపు చివరి చంద్ర గ్రహణం
  • చివరి చంద్ర గ్రహణం ఈ రాశివారిపై తీవ్ర ప్రభావం చూపనుంది
Chandra Grahanam 2021: నవంబర్ 19న కార్తీక పౌర్ణమి.. ఆ రోజే చివరి చంద్ర గ్రహణం.. ఆ రాశిపై ప్రభావం!

Chandra Grahan 2021: ఈ ఏడాది వచ్చే చంద్ర గ్రహణాల్లో (Lunar Eclipse) చివరి గ్రహణం మరి కొన్ని రోజుల్లో రాబోతుంది. మొదటి చంద్ర గ్రహణం 'మే నెలలో' వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే రెండవ మరియు ఈ సంవత్సరపు చివరి చంద్ర గ్రహణం నవంబర్ 19  రాబోతుంది. అది కూడా ఈ నెల రాబోయే కార్తీక పౌర్ణమి (Karthika Pournami 2021) రోజు వస్తుండటం మరో విశేషం.. 

మన తెలుగు సాంప్రదాయం మరియు జ్యోతిషశాస్త్ర ప్రకారం చూసుకుంటే, కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఇలాంటి సమయంలో ఈ గ్రహణం కార్తీక పౌర్ణమి రోజు రావటంతో చాలా మందిపై దీనిపై ప్రభావం పడనుంది. అయితే ఇది పాక్షిక చంద్రగ్రహణం (Partial Lunar Eclipse) కారణంగా, భారత దేశంలో చాలా ప్రదేశాలలో ఈ చంద్రగ్రహణం కనిపించదు. కానీ అస్సాం (Assam) మరియు అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) లాంటి కొన్ని ప్రదేశాల్లో మాత్రం ఈ గ్రహణం కనిపిస్తుంది. 

Also Read: Australia vs Pakistan: ఆస్ట్రేలియాతో మ్యాచుకు ముందు పాకిస్తాన్ జట్టుకు షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లు మ్యాచుకు దూరం!

సూతక కాలం  చెల్లదు.. 
సూతక కాలం  (Sutak Time) అనగా.. సూర్య లేదా చంద్ర గ్రహణ సమయాల్లో వచ్చే "చెడు లేదా నీచ లేదా అశుభ" సమయాన్ని సూతక కాలం అంటారు. ఈ సంవత్సరంలో వచ్చే చివరి గ్రహణం కారణంగా ఈ సమయంలో సూతక కాలం చెల్లదు. మరో వైపు కార్తీక పౌర్ణమి కారణంగా ప్రజలు గంగా నదిలో స్నానం చేసే దీపారాధన, అన్నదానం వంటి కార్యక్రమాలల్లో పాల్గొంటారు. ఇది పాక్షిక సూర్యగ్రహణం కనుక మతపరమైన పనులన్నీ సాధారణ పద్దతిలో చేయవచ్చు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నవంబర్ 19 2021న, శుక్రవారం ఈ చంద్రగ్రహణం భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 05:33 గంటలకు ముగుస్తుంది.

వృషభ రాశివారు జాగ్రత్తగా ఉండండి
ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం రాబోయే కార్తీక పౌర్ణమి రోజు రాబోతుంది కావున వృషభరాశి (Taurus Horoscope) వారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెపుతుంది. వృషభరాశి వారు గ్రహణం సయమంలో గాయపడే అవకాశాలు ఉన్నందున.. గ్రహణ ప్రారంభ సమయం నుండి ముగిసే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ రాశివారు గ్రహణం ముగిసిన తరువాత కూడా దాన-దర్మం చేయటం తప్పనిసరి. దానం చేయటం వల్ల గ్రహణ సమయం కలిగే అశుభ  ప్రభావాన్ని కొంచెమైనా తగ్గించవచ్చు. 

Also Read: Chiranjeevi Bhola Shankar Movie: భోళా శంకర్ మూవీ షూటింగ్ స్టార్ట్.. కాస్ట్ అండ్ క్రూ ను ప్రకటించిన చిత్రబృందం

2021 సంవత్సరంలో మొత్తంగా 4 గ్రహణాలు సంభవించనున్నాయి.. వీటిలో 2 చంద్ర గ్రహణాలు కాగా మరో 2 సూర్య గ్రహణాలు. ఇప్పటి వరకు వీటిలో 1 సూర్యగ్రహణం మరియు 1 చంద్రగ్రహణం ముగియగా.... మరో చంద్రగహణం నవంబర్ 19న కార్తీక పౌర్ణమి రోజు వస్తుండగా.. మరో సూర్య గ్రహణం 4 డిసెంబర్ 2021న జరుగుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News