Mumbai Indians Players Surya Kumar Yadav And Ishan Kishan: ఎన్నో ఏళ్ల కష్టం ఫలించింది. డోమెస్టిక్ సీనియర్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు యువ ఆటగాళ్లు రాహుల్ తెవాటియా, ఇషాన్ కిషన్‌లు ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యారు. అయితే తమ జట్టు ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లు భారత జాతీయ జట్టుకు ఎంపిక కావడంపై ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ హర్షం వ్యక్తం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుదీర్ఘ కాలం నుంచి శ్రమించిన వారికి నేడు ప్రతిఫలం దక్కింది. వారి కష్టానికి నేడు జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చిందని ముంబై ఇండియన్స్(Mumbai Indians) టీమ్ మేనేజ్‌మెంట్ అభిప్రాయపడింది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లకు ఆల్ ద బెస్ట్ చెబుతూ ట్వీట్ చేసింది. మరోవైపు ఓ మ్యాచ్‌లో సునామీ ఇన్నింగ్స్ ఆడి ఒకే ఓవర్లో 5 సిక్సర్లు బాదిన రాహుల్ తెవాటియాకు సైతం టీమిండియా నుంచి పిలుపు రావడం గమనార్హం.


Also Read: Arjun Tendulkar: ముంబై ఇండియన్స్ ఆటగాడు అర్జున్ టెండూల్కర్ ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉందో చూడండి, Viral Video



మరోవైపు గత ఏడాది ఐపీఎల్ 2020(IPL 2021) అనంతరం ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌కు వరుణ్ చక్రవర్తి ఎంపికైనా గాయం కారణంగా ఆడలేకపోయాడు. దాంతో మరో అవకాశం లభించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ప్రాతినిథ్యం వహించే వరుణ్ చక్రవర్తిని సైతం ఇంగ్లాండ్‌తో జరగనున్న 5 టీ20ల సిరీస్‌కు ఎంపిక చేశారు. 


Also Read: Glenn Maxwell పంట పండింది, రూ.14.25 కోట్లకు అమ్ముడైన లక్కీ ప్లేయర్


ఐపీఎల్ ప్రదర్శన కారణంగానే వీరికి జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. కొత్త ఆటగాళ్లు సూర్యకుమార్, ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ తెవాటియాలు టీమిండియాకు సెలక్ట్ కావడంతో మాజీ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి భవిష్యత్ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నారు.


విరాట్ కోహ్లీ కెప్టెన్ కాగా, ఓపెనర్ రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, యుజువేంద్ర చాహల్, ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, టి నటరాజన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, నవదీప్ సైని, శార్దూల్ ఠాకూర్.


Also Read: IPL 2021 Auction: ఐపీఎల్ 2021లో Sunrisers Hyderabad మొత్తం ఆటగాళ్ల జాబితా ఇదే 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook