Neeraj Chopra Silver: ఇలాంటి సపోర్ట్ ఉంటే.. భారత్ క్రీడల్లో ఇంకా ముందుకు దూసుకుపోతుంది: నీరజ్ చోప్రా
Neeraj Chopra first reaction after winning silver in World Athletics Championships. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)తో నీరజ్ చోప్రా మాట్లాడుతూ దేశానికి పథకం తెచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు.
Neeraj Chopra first reaction after winning silver: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 2022లో చరిత్ర సృష్టించాడు. అమెరికా వేదికగా జరుగుతున్న మెగా ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ సాధించాడు. ఆదివారం ఉదయం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా ఈటెను 88.13 మీటర్ల దూరం విసిరి.. రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్, గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ ఈటెను 90.46 మీటర్ల దూరం విసరి పసిడి కైవసం చేసుకున్నాడు.
స్వర్ణ పతకంపై ఆశలు కల్పించిన నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలో ఫౌల్ చేశాడు. రెండో ప్రయత్నంలో ఈటెను 82.39 మీటర్లు విసిరిన నీరజ్.. మూడో ప్రయత్నంలో 86.37 విసిరాడు. ఇక నాలుగో ప్రయత్నంలో మాత్రం 88.13 మీటర్లు విసిరి టాప్-2లోకి వచ్చాడు. అయితే కీలకమైన ఐదో ప్రయత్నంలో మళ్లీ ఫౌల్ చేశాడు. అండర్సన్ పీటర్సన్ తొలి ప్రయత్నంలోనే 90.54 మీటర్లతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వాద్లెచ్ (88.09 మీటర్లు)తో కాంస్యం గెలిచాడు.
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన రెండో భారత అథ్లెట్‌గా నీరజ్ చోప్రా నిలిచాడు. 2003 ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో లాంగ్ జంప్ విభాగంలో అంజు బాబీ జార్జ్ కాంస్య పతాకాన్ని గెలిచారు. 2022లో నీరజ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పతాకాన్ని గెలిచాడు. ఇక ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన తొలి జావెలిన్ త్రోయర్‌గా నీరజ్ చరిత్రకెక్కాడు. భారత్ ఖాతాలో పథకం చేరడంతో అభిమానులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)తో నీరజ్ చోప్రా మాట్లాడుతూ దేశానికి పథకం తెచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు. 'అందరికీ నమస్కారం. భారత దేశానికి రజతం పథకం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. గోల్డ్ మెడల్ కోసం ట్రై చేశాను కానీ కుదరలేదు. వచ్చే ఏడాది మళ్లీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు ఉన్నాయి, అక్కడ గోల్డ్ మెడలే లక్ష్యం. విదేశీ కోచ్‌ని ఇచ్చి శిక్షణ కోసం విదేశాలకు పంపిన సాయ్, ఫెడరేషన్, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ప్రతి క్రీడలో ఇలా సపోర్ట్ ఉంటే.. మేము మరింత పురోగతి సాధిస్తాము. భారత్ క్రీడల్లో ఇంకా ముందుకు దూసుకుపోతుంది' అని నీరజ్ అన్నాడు.
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు...
Also Read: Horoscope Today July 24th : నేటి రాశి ఫలాలు.. ఈ 8 రాశుల వారికి శుభ దినం.. మంచి ఫలితాలు పొందుతారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.