Horoscope Today July 24th : నేటి రాశి ఫలాలు.. ఈ 8 రాశుల వారికి శుభ దినం.. మంచి ఫలితాలు పొందుతారు..

Horoscope Today July 24th 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవాళ రాశిచక్రంలోని 8 రాశుల వారికి శుభ దినం. మరో నాలుగు రాశుల వారికి ప్రతికూల సమయం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 24, 2022, 06:42 AM IST
  • జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇవాళ 8 రాశుల వారికి శుభ దినం
  • నాలుగు రాశుల వారికి ప్రతికూల సమయం
  • ఇవాళ్టి రాశి ఫలాల్లో ఏయే రాశుల వారి జాతకం ఎలా ఉందో తెలుసుకోండి
Horoscope Today July 24th : నేటి రాశి ఫలాలు.. ఈ 8 రాశుల వారికి శుభ దినం.. మంచి ఫలితాలు పొందుతారు..

Horoscope Today July 24th 2022: ఇవాళ ఆదివారం. హిందువులు సూర్య భగవానుడిని పూజిస్తారు. సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించి పూజించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. మరి ఈ ఆదివారం ఏయే రాశుల వారి జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి (Aries)

చంద్ర అనుగ్రహం కలిసొస్తుంది. అది మీకు సంతోషాలను తీసుకొస్తుంది. వ్యాపారస్తులు పెద్ద ఆర్డర్స్‌కి అడ్వాన్స్ పొందుతారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీ వ్యాపార పురోగతికి దోహదపడుతాయి. ఆ స్కిల్స్‌తోనే వ్యాపార వర్గాల్లో మీ పేరు హాట్ టాపిక్‌గా మారుతుంది. సంక్లిష్ఠ పరిస్థితుల్లోనూ చాకచక్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో సన్నిహితులు,దగ్గరి బంధువుల సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం.

వృషభ రాశి (Taurus)

ఇవాళ మీకు చంద్ర అనుగ్రహం లభిస్తుంది. రోజంతా సాఫీగా సాగుతుంది. వృత్తిరీత్యా, వ్యక్తిగత జీవితంలోనూ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. చేపట్టిన ఏ పనైనా సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టే ప్లాన్స్ ఉంటాయి. పనిలో మీ పెర్ఫెక్షన్ నలుగురి చేత శెభాష్ అనిపించుకునేలా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారు టీమ్ లీడ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది. 

మిథున రాశి (GEMINI)

ఇవాళ మీకు ప్రతికూల సమయం. నెగటివ్ వైబ్స్ వెంటాడుతాయి. కొన్ని తప్పుడు నిర్ణయాలు లేదా తొందరపాటు నిర్ణయాలు మిమ్మల్ని రిస్క్‌లోకి నెట్టుతాయి. ఏ నిర్ణయం తీసుకునేముందైనా ఒకటికి రెండుసార్లు ఆచీతూచీ వ్యవహరించండి. డబ్బును వృథా చేయకండి. పిల్లల భవిష్యత్తు కోసం కొత్త పెట్టుబడులు లేదా స్కీమ్స్‌లో పొదుపు చేసే అవకాశం ఉంటుంది.

కర్కాటక రాశి (Cancer) 

ఇవాళ చంద్ర అనుగ్రహంతో అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. ఇదివరకు వాయిదాపడిన పనులు కూడా చకచకా సాగిపోతాయి. చాలాకాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్న  అవివాహితులకు మంచి సంబంధం వెతుక్కుంటూ వస్తుంది. పెళ్లి, కెరీర్ విషయంలో మరో ఆలోచన లేకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. జీవితం మునుపటికన్నా సంతోషకరంగా ఉంటుంది.

సింహ రాశి (LEO)

పనిలో బిజీ బిజీగా గడుపుతారు. మీ నెట్‌వర్క్ సాయంతో చేపట్టిన పనిని ఇట్టే పూర్తి చేస్తారు. ఇదివరకు మీ సాయం తీసుకున్నవారు అందుకు ప్రతిఫలంగా ఏదైనా బహుమతి అందజేస్తారు. గతంలో పెట్టుబడిన పెట్టుబడులు లాభాలను తీసుకొస్తాయి. జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.

కన్య రాశి (Virgo)

చంద్ర అనుగ్రహం ఉంటుంది. మీ చుట్టూ నెగటివిటీ తొలగిపోతుంది. పడిన కష్టం వృథాగా పోదు. ఏదో ఒక రూపంలో ప్రతిఫలం దక్కి తీరుతుంది. మీ సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. గతంలో వాయిదాపడిన పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి. 

తులా రాశి (Libra)

ఇవాళ నిరాశజనకంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆఫీసు పనులు ఉన్నవారు ఇవాళ పని చేయలేకపోతారు. వ్యాపారస్తులు విశ్రాంతి కోరుకుంటారు. బిజీ జీవితంలో పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేశామని గ్రహిస్తారు. డబ్బు వెనకాల పరిగెత్తే క్రమంలో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసినందుకు చింతిస్తారు. ఇప్పటినుంచైనా తగిన విశ్రాంతి అవసరమని గుర్తిస్తారు. 

వృశ్చిక రాశి (Scorpio)

ఇవాళ మీలో ఉత్సాహం ఉరకలేస్తుంది. పనిలో హుషారుగా ఉంటారు. ఇతరులు మిమ్మల్ని చూసి స్పూర్తి పొందేలా ముందుండి లీడ్ చేస్తారు. సత్వర నిర్ణయాలు కలిసొస్తాయి. కొత్త ఆవిష్కరణలు చేపడుతారు. స్థిరాస్తి రంగంలో పార్ట్‌నర్‌తో కలిసి పెట్టుబడులు పెట్టవద్దు. ఇది మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. వీలైనంతవరకు సొంత పెట్టుబడులే మంచిదని గుర్తించండి.

ధనుస్సు రాశి (Sagittarius)  

అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. చాలాకాలంగా మీకు రాకుండా నిలిచిపోయిన పెండింగ్ బకాయిలు వసూలవుతాయి. లగ్జరీ వస్తువుల కొనుగోలుకు రుణం కోసం అప్లై చేస్తారు. కొత్త ఇల్లు లేదా వాహన కొనుగోలుకు అవకాశం ఉంటుంది. ఇది మీకు సొంతింటి కల నెరవేరే సమయం. పిల్లల చదువుల కోసం ఖర్చులు పెరుగుతాయి. 

మకర రాశి (Capricorn) 

కుజుడి అనుగ్రహంతో ఆర్థిక పురోగతి ఉంటుంది. మునుపటికన్నా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వచ్చిన అవకాశాలను మరో ఆలోచన లేకుండా ఒడిసిపట్టుకోగలుగుతారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ప్రేమ పక్షులు సంతోష సమయం గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి తగిన జాబ్ దొరుకుతుంది.

కుంభ రాశి (Aquarius)

ఇవాళ మీరు చాలా నిరాశగా, అసంతృప్తిగా ఉంటారు. చేపట్టిన పనిని ఆస్వాదించలేరు. ఎదుటివారి అసహనం, అహంకారానికి మీరు బాధితులుగా మిగులుతారు. వృత్తి రీత్యా పూర్తి ప్రతికూల సమయం. ఉద్యోగాన్ని వీడే ఆలోచన కూడా చేస్తారు. మీ దృష్టిని క్రియేటివిటీ వైపు మళ్లించడం ద్వారా ఈ పరిస్థితుల నుంచి కాస్త ఉపశమనం పొందుతారు.

మీన రాశి (Pisces) 

ఇవాళ మీరు చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. పనిలో బాగా రాణిస్తారు. మీ కృషికి తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయి. స్థిరాస్తి వివాదాలు తొలగిపోతాయి. తోబుట్టువులతో తగాదాలు పరిష్కారమవుతాయి. అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ల అనుబంధం మరింత వికసిస్తుంది. ఇవాళ మీ ఇంటికి చుట్టాలు లేదా తెలిసినవారు వచ్చే అవకాశం ఉంటుంది.

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)

Also Read: WHO about Monkeypox : మంకీపాక్స్‌ని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్లూహెచ్ఓ

Also Read: National Flag: ప్లాగ్ కోడ్‌లో కీలక మార్పులు..సవరణలకు కేంద్రం పచ్చజెండా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News