రంగస్థలంపై నారా లోకేశ్ ప్రశంసల వర్షం
ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేశ్ `రంగస్థలం` సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేశ్ "రంగస్థలం" సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా చూసి ట్విట్టర్ ద్వారా స్పందించిన నారా లోకేష్ మాట్లాడుతూ "ఈ అద్భుతమైన చిత్రాన్ని మేము చూడడానికి అందించినందుకు రామ్ చరణ్, సుకుమార్ టీమ్‌కు నా అభినందనలు. ఈ సినిమా చూడడం పూర్తయ్యాక కూడా అందులోని పాత్రలు మనతోనే చాలాసేపు వరకూ ఉంటాయి. మంచి ప్రయత్నం మిత్రుల్లారా.." అని ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్‌కు బదులిస్తూ, రామ్ చరణ్ ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇటీవలి కాలంలో విడుదలైన రంగస్థలం చిత్రానికి మంచి రెస్పాన్సే వస్తోంది. ఇప్పటికే అనేక మంది చలనచిత్ర ప్రముఖులు ఈ చిత్రాన్ని బహిరంగంగానే ప్రశంసించారు. నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రానికి రివ్యూలు కూడా బాగానే వచ్చాయి
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన "రంగస్థలం" చిత్రంలో రామ్ చరణ్ చిట్టిబాబు పాత్రలో నటించగా.. పల్లెపడుచు రామలక్ష్మి పాత్రలో సమంత నటించిది. మరో ప్రధాన పాత్రైన రంగమ్మత్తగా అనసూయ నటించిన మార్చి 30వ తేదిన విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే 100 కోట్లకు పైగానే వసూళ్లను నమోదు చేసింది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా బాగానే దూసుకుపోతోంది ఈ చిత్రం.