Tokyo olympics: టోక్యో ఒలింపిక్స్(Tokyo olympics) లో భారత యువ ఆటగాడు నీరజ్‌ చోప్రా (Neeraj Chopra) సరికొత్త చరిత్ర సృష్టించాడు. అఖండ భారతావనిని ఆనందంలో ముంచెత్తుతూ వందేళ్ల కలను నిజం చేశాడు.. స్వత్రంత్ర భారత దేశంలో.. వ్యక్తిగత క్రీడల్లో అభినవ్‌ బింద్రా(Abhinav Bindra) తర్వాత పసిడి పతకం అందుకున్న వీరుడిగా ఘనత సాధించాడు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


నీరజ్ చోప్రా(Neeraj Chopra)  ఈటెను విసరడంలో తిరుగులేని ఆధిపత్యం కనబరిచాడు. పేవరెట్లను వెనక్కి నెట్టి పసిడి పతాన్ని అందుకున్నాడు.   భారత కీర్తిపతాకను అత్యున్నత శిఖరాలలో రెపరెపలాడించేలా చేశాడు. అందరికన్నా మెరుగ్గా ఆడుతూ.. ఈటెను 87.58 మీటర్లు విసిరి నయా చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించాడు. ఆసియా, కామన్వెల్త్‌లో స్వర్ణ పతకాలు గెలిచిన నీరజ్‌ ఒలింపిక్స్‌ (Olympics) అర్హత పోటీల్లోనూ అగ్ర స్థానంలో నిలిచాడు.


Also Read: టోక్యో ఒలింపిక్స్‌: అదితి అశోక్‌కు గోల్ఫ్‌లో జస్ట్ మిస్ అయిన బ్రాంజ్ మెడల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook