Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే గొప్ప బ్యాట్స్‌మెన్ కాదు.. టిమ్ సౌథీ షాకింగ్ కామెంట్స్
Tim Southee on Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ సూపర్ సెంచరీతో న్యూజిలాండ్‌ను టీమిండియా అలవోకగా చిత్తు చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
Tim Southee on Suryakumar Yadav: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టారు. సూర్యకుమార్ యాదవ్ తన కెరీర్‌లో రెండో టీ20 సెంచరీ బాదడంతో భారత్ గెలుపు సులువైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం కివీస్ 18.5 ఓవర్లలో 126 రన్స్‌కే ఆలౌట్ అయింది.
ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ సూపర్ ఇన్నింగ్స్‌పై వెటరన్ కివీస్ బౌలర్ టిమ్ సౌథీ ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్యకుమార్ యాదవ్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడినట్లు పేర్కొన్నాడు. టీ20 మ్యాచ్‌లో ఆటగాడు సెంచరీ చేసినప్పుడల్లా అది ఎల్లప్పుడూ భిన్నంగా ఉంటుందని.. సూర్యకుమార్ ఇన్నింగ్స్ టీమిండియాను గర్వంచేలా చేసిందన్నాడు. భారత్ 175-180 పరుగులలోపే పరిమితమవుతుందని అనుకున్నామని.. కానీ 190 కంటే ఎక్కువ రన్స్ సాధించడంలో సూర్య కీలక పాత్ర పోషించాడని అభినందించాడు. ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్‌లో 12 నుంచి 18 నెలలు గొప్పగా ఆడుతున్నాడని ఉన్నాడని అన్నాడు.
సూర్యకుమార్ యాదవ్ గొప్ప టీ20 భారత బ్యాటర్ అని అడగ్గా.. "భారత్ నుంచి చాలా మంది గొప్ప టీ20 ఆటగాళ్లు ఉన్నారు. అతను ఒక్కడే కాదు. అక్కడి నుంచి చాలా మంచి క్రికెట్ ప్లేయర్లు వస్తారు. నేను సూర్యకుమార్ ప్రస్తుత ఫామ్‌ను అలాగే కొనసాగించాలి. భారత్‌కు టీ20ల్లోనే కాకుండా మూడు ఫార్మాట్‌లలో గొప్ప ఆటగాళ్లు ఉన్నారు." అని టిమ్ సౌథీ చెప్పాడు.
సూర్యకుమార్‌కి ప్రారంభంలో బాగానే బౌలింగ్ చేశామని.. మొదటి 3-4 బంతుల్లో ఇబ్బంది పడినా తరువాత మంచి స్కోర్ చేశాడని అన్నాడు సౌథీ. ఆట మధ్యలో వర్షం కారణంగా రెండు జట్లకు ఒకే విధమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పాడు. ఇక చివరి ఓవర్లో ఫీల్డర్లను దగ్గరగా సెట్ చేయడంతో తనకు కలిసి వచ్చిందన్నాడు. హ్యాట్రిక్‌తో ఇన్నింగ్స్‌ను ముగించడం సంతోషంగా ఉందన్నాడు.
Also Read: Shraddha Murder Case: శ్రద్ధా హత్య కేసులో సరికొత్త కోణం.. విచారణలో పోలీసులకే షాక్..!
Also Read: Jabardasth Rakesh - Sujatha : జామ తోటలో ప్రేమ పక్షులు.. జబర్దస్త్ రాకేష్, సుజాత వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook