Jabardasth Rakesh - Sujatha : జామ తోటలో ప్రేమ పక్షులు.. జబర్దస్త్ రాకేష్‌, సుజాత వీడియో వైరల్

Jabardasth Rakesh And Sujatha జబర్దస్త్ రాకేష్‌, సుజాతల ప్రేమ కథల మీద ఎన్నెన్నో కథనాలు వస్తుంటాయి. ఈ ఇద్దరి మధ్య ఉన్నది ఏంటనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.. రావడం లేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2022, 08:36 AM IST
  • జబర్దస్త్ స్టేజ్ మీద కొత్త జంట
  • నెట్టింట్లో రాకేష్, సుజతల సందడి
  • జామతోటలో ప్రేమ పక్షుల హల్చల్
Jabardasth Rakesh - Sujatha : జామ తోటలో ప్రేమ పక్షులు.. జబర్దస్త్ రాకేష్‌, సుజాత వీడియో వైరల్

Jabardasth Rakesh And Sujatha : బుల్లితెరపై ట్రాకులు ఎంతగా వర్కౌట్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే. సుధీర్ రష్మీ, వర్ష ఇమాన్యుయేల్‌కు సోషల్ మీడియాలో వచ్చిన క్రేజ్ అందరికీ తెలిసిందే. సుజాత, రాకేష్‌ల జంట గురించి కూడా సోషల్ మీడియాలో ఉండే చర్చలు మామూలుగా ఉండవు. ఈ ఇద్దరూ కలిసే ఉంటారు. కలిసే కనిపిస్తారు. యూట్యూబ్ వీడియోల్లో ఈ ఇద్దరూ నానా హంగామా చేస్తుంటారు. కలిసి వెకేషన్లకు వెళ్తుంటారు. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని, త్వరలోనే శుభవార్త చెబుతారంటూ నెటిజన్లు భావిస్తుంటారు. కానీ ఇంత వరకు వీరు తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rocking Rakesh (@jabardasthrakesh)

జబర్దస్త్ స్టేజ్ మీద సుజాత, రాకేష్‌లు చేసే రొమాంటిక్ స్కిట్లు, ఇచ్చే ఎలివేషన్లు మామూలుగా ఉండవు. సుజాత రాకేష్‌లు నిజంగానే ప్రేమలో ఉన్నట్టుగా డైలాగ్స్ కొడుతుంటారు. ఇతర ఈవెంట్లు, షోల్లో కనిపించినా ఈ ఇద్దరూ ప్రేమ పక్షుల్లానే నటిస్తారు. కనిపిస్తారు. ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ షోలో కనిపిస్తున్నారు. అక్కడ కూడా ఈ ఇద్దరూ అమర ప్రేమికుల్లానే డైలాగ్స్ కొడుతున్నారు.

సుజాత కూడా రాకేష్ ఇంట్లోనే ఉంటున్నట్టుగా కనిపిస్తోంది. ఎప్పుడూ రాకేష్‌తోనే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. రాకేష్‌ ఇంట్లో వరలక్ష్మీ వ్రతం జరిగితే సుజాత వచ్చింది. రచ్చ రవి తన కొత్త కారుతో రాకేష్‌ ఇంటికి వచ్చి చూపిస్తే అప్పుడు కూడా సుజాత అక్కడే కనిపించింది. అలా ఈ ఇద్దరూ ఎక్కువగా కలిసే కనిపిస్తుంటారు.

తాజాగా ఈ ఇద్దరూ జామ తోటలో అలా విహరిస్తున్నారు. జామ కాయలను తెంపుతూ అలా పొలంలో తిరుగుతూ స్వేచ్చగా విహరిస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ ప్రేమ పక్షులు మాత్రం ఇలా తోటల్లో తిరుగుతూ సందడి చేస్తున్నారు. అయితే వీరిద్దరూ తమ బంధాన్ని ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో? మూడు ముళ్ల బంధంతో ఎప్పుడు ఒక్కటి అవుతారో చూడాలి.

Also Read : IFFI Award 2022: మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసల వర్షం, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు

Also Read : Rashmika Mandanna Hot Photos: రెడ్ గాగ్రా ఛోళీలో రష్మిక హాట్ ట్రీట్..ఎద అందాల విందు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

 

Trending News