Trent Boult News: నేటి (నవంబరు 17) నుంచి ఇండియా – న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభ కానుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ లో జరగనుంది. అయితే ఇప్పటికే టీ20 సిరీస్ నుంచి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తప్పుకోగా.. ఇప్పుడు మరో క్రికెటర్ సిరీస్ నుంచి వైదలొగనున్నాడు. కివీస్ టీమ్ లో కీలక బౌలర్ అయిన ట్రెంట్ బౌల్ట్.. టీమ్ఇండియా టెస్టు సిరీస్ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించాడు. శారీరక, మానసిక విశ్రాంతి కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు బౌల్ట్ ప్రకటించాడు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2021 రెండో దశలోని మ్యాచులు ఆడేందుకు యూఏఈ వచ్చి బయోబబుల్ లో చేరాడు ట్రెంట్ బౌల్ట్. ఆ తర్వాత అందులోనే ఉంటూ టీ20 ప్రపంచ కప్ కూడా పూర్తి చేశాడు. దాంతో 12 వారాల నాన్‌ స్టాప్ క్రికెట్ తర్వాత తనను తాను రిఫ్రెష్ చేసుకోవాలనుకుంటున్నానని.. అందుకే ఈ టెస్టు సిరీస్ నుండి తప్పుకుంటున్నట్లు బౌల్ట్ పేర్కొన్నాడు.


టీ20లకు విలియమ్సన్ దూరం


అంతకుముందు టీమ్ఇండియాతో నేటి నుంచి జరగనున్న టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్. నవంబర్ 25 నుంచి కాన్పూర్‌లో ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌పై పూర్తిగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకే టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. దీంతో టీ20 సిరీస్ కు పేసర్ టిమ్ సౌథీ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. 


Also Read: IND VS NZ: కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ కు తొలి పరీక్ష...కివీస్ తో టీ20 నేడు..


Also Read: Champions Trophy Host: 2025లో ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమివ్వనున్న పాకిస్తాన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook