Neil Wagner Retirement: న్యూజిలాండ్ స్టార్ పేస‌ర్ నీల్ వాగ్న‌ర్ (Neil Wagner) అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు ముందు వాగ్న‌ర్ తన వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటించి అందరినీ షాక్ కు గురి చేశాడు. దీంతో అతడి 12 ఏళ్ల కెరీర్ కు ఎండ్ కార్డు పడింది. మంగళవారం మీడియా సమావేశంలో తన వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటిస్తూ వాగ్నర్ కన్నీటిపర్యంతమయ్యాడు. మంచి ఫామ్ లో ఉన్న సమయంలో గుడ్ బై చెప్పడం చాలా బాధగా ఉందని..అయితే న్యూజిలాండ్ తరపున ఆడటాన్ని ఎంతగానో ఎంజాయ్ చేశానని వాగ్నర్ అన్నాడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అండగా నిలిచిన జట్టు సభ్యులకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని వాగ్నర్ తెలిపాడు. అయితే దేశవాళీలో క్రికెట్ లో ఆడతానని అతడు చెప్పాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ గెలిచిన జట్టులో వాగ్నర్ కూడా సభ్యుడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాగ్నర్ క్రికెట్ ప్రస్థానం


37 ఏళ్ల వాగ్నర్ కివీస్ తరుపున 2012లో వెస్టిండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. వెల్లింగ్ట‌న్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో 39 ప‌రుగుల‌కే ఏడు వికెట్లు తీసి అత్యుత్త‌మ గ‌ణాంకాలు న‌మోదు చేశాడు. ఇప్పటి వరకు 64 టెస్టులు ఆడి 260 వికెట్లు పడగొట్టాడు. రిచ‌ర్డ్ హ‌డ్లే త‌ర్వాత మెరుగైన స‌గ‌టుతో వందకు పైగా వికెట్లు తీసిన రెండో న్యూజిలాండ్ బౌల‌ర్‌గా అత‌డు రికార్డులకు ఎక్కారు. తాజాగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు వాగ్నర్. అయితే సిరీస్ మ‌ధ్య‌లోనే త‌న రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని బోర్డుకు తెలియ‌జేశాడు. దాంతో ఫిబ్ర‌వ‌రి 29 నుంచి జరగబోయే రెండో టెస్టు స్క్వాడ్ నుంచి అత‌డిని రిలీజ్ చేయనున్నారు. 



Also Read: Team India: ఇంగ్లండ్ బజ్‌బాల్ గేమ్ కు బ్రేకులు వేసిన రోహిత్ సేన.. భారత్ ఖాతాలో 17వ సిరీస్ విజయం..


Also Read: Hanuma Vihari: హనుమా విహారి సంచలన పోస్ట్.. ఆ ప్లేయర్‌ను తిట్టినందుకే కెప్టెన్సీ పోయింది..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook