IND vs NZ: తొలి టెస్టు డ్రా.. టీమిండియా విజయాన్ని అడ్డుకున్న రవీంద్ర! అభిమానుల్లో టెన్షన్ పెంచిన అంపైర్!
కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ మైదానంలో భారత్, న్యూజీలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. చివరి సెషన్‌లో భారత బౌలర్లు వికెట్లు పడగొట్టడంతో భారత్ విజయం ఖాయం అని అందరూ అనుకున్నారు. అయితే కివీస్ బౌలర్లు అజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర భారత్ విజయాన్ని అడ్డుకున్నారు.
New Zealand’s last wicket Rachin Ravindra, Ajaz Patel batted out 52 balls to deny India a win: కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ మైదానంలో భారత్, న్యూజీలాండ్ (India vs New Zealand) జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. రెండవ ఇన్నింగ్స్‌లో 284 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ చివరి రోజు ఆట ముగిసేసరికి 165/9 స్కోరుతో నిలిచింది. చివరి సెషన్‌లో భారత బౌలర్లు వికెట్లు పడగొట్టడంతో భారత్ విజయం ఖాయం అని అందరూ అనుకున్నారు. మరో వికెట్ తీసి ఉంటే రహానే సేన ఘన విజయం సాధించేదే. అయితే కివీస్ బౌలర్లు అజాజ్ పటేల్ (Ajaz Patel 2; 23 బంతుల్లో), రచిన్ రవీంద్ర (Rachin Ravindra 18: 91 బంతుల్లో 2 ఫోర్లు) ఆచితూచి ఆడి భారత్ విజయాన్ని అడ్డుకున్నారు. కివీస్ ఓటమిని తప్పించుకుందంటే.. ఆ క్రెడిట్ మొత్తం రవీంద్రకే దక్కుతుంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 4, ఆర్ అశ్విన్ (R Ashwin) 3 వికెట్లు పడగొట్టాడు.
న్యూజిలాండ్ ముందు భారత్ నిర్దేశించిన లక్ష్యం 284 పరుగులు. నాలుగో రోజు ఆట ముగిసే సరికి కివీస్.. ఓపెనర్ విల్ యంగ్ (2) వికెట్ కోల్పోయి 4 పరుగులు చేసింది. ఇక ఐదో రోజు బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఆరంభంలో బాగానే ఆడింది. ఓపెనర్ టామ్ లాథమ్ (52), విలియమ్ సోమర్ విల్లే (36) ఆచితూచి ఆడారు. నైట్ వాచ్‌మెన్ సోమర్‌విల్లెను ఉమేష్ యాదవ్ అవుట్ చేశాడు. ఈ సమయంలో లాథమ్ అర్ధ శతకంతో రాణించి అశ్విన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఇక ఇక్కడి నుంచి భారత బౌలర్లు చెలరేగడంతో.. కివీస్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు.
రాస్ టేలర్ (2)ను రవీంద్ర జడేజా ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. కాసేపటికే హెన్రీ నికోల్స్ (1)ను అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. ఆపై కేన్ విలియమ్సన్ (24), టామ్ బ్లండెల్ (2) కూడా ఔట్ అవ్వడంతో కివీస్ 138 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. కాసేపటికే కైల్ జేమిసన్ (5), టీమ్ సౌథీ (4)లు పెవిలియన్ చేరడంతో భారత్ విజయం లాంఛనమే అనుకున్నారంతా. కానీ రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ భారత్ ఆశలపై నీళ్లు చల్లారు. భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ కివీస్ జట్టును ఓటమి నుంచి కాపాడారు. దీంతో తొలి టెస్టు డ్రాగా ముగిసింది. భారత బౌలర్లలో జడేజా 4, అశ్విన్ 3, అక్షర్ 1, ఉమేష్ 1 వికెట్ పడగొట్టారు.
Also Read: ఒమిక్రాన్‌పై కేంద్రం అప్రమత్తత, అంతర్జాతీయ ప్రయాణాలపై మార్గదర్శకాలు
వెలుతురులేమి కూడా భారత్ విజయాన్ని అడ్డుకుందనే చెప్పాలి. మూడో సెషన్ చివర్లో భారత బౌలర్లు ఓవర్ వేయడానికి వచ్చిన ప్రతిసారీ.. ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ (Nitin Menon) లైటింగ్ చెక్ చేస్తూ భారత అభిమానుల్లో మరింత ఉత్కంఠ పెంచాడు. ఒక్క వికెట్ పడగొడితే విజయం టీమిండియా సొంతమవుతుందన్న సమయంలో.. నితిన్ మీనన్ చాలాసార్లు లైట్ చెక్ చేశాడు. అది అభిమానుల్లో మరింత టెన్షన్ పెంచింది. మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానం కలిగింది. అయితే చివరకు పూర్తి కోటా ఓవర్లు వేసినా.. రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ జోడీని భారత బౌలర్లు విడదీయలేకపోయారు. దాంతో ఇండియన్ ఫాన్స్ (Indian Fans) నిరాశ వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook