నాల్గో వన్డేలో టీమిండియాపై న్యూజిల్యాండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో కివీస్ గెలుపొందింది. 93 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ..14.5 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. ఫలితంగా న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో 1-3 తేడాలో న్యూజిల్యాండ్ నిలిచింది. తొలి మూడు వన్డేల్లో టీమిండియా విజయం సాధించి సిరీస్ కైససం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యచ్ లో కివీస్ సత్తా చాటి టీమిండియా ఆధిపత్యానికి అడ్డుకట్టవేయగల్గింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విఫలయైన ప్రయోగం..


నాల్గోవన్డేలో టీమిండియా ప్రయోగం విఫలమైంది.  ధోనీ, కోహ్లీ లోటు కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. కివీస్ ఫేస్ దాటికి  టీమిండియా అమాంతంగా కుప్పకూలింది. 30.5 ఓవర్లలు మాత్రమే ఆడిన టీమిండియా  92 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బ్యాట్స్ మెన్లలలో కనీసం ఒక్కరైనా 20 పరుగుల మార్క్ ను అందుకోలేకపోయారు. ఇద్దరు అసలు పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ గా పెవీలియన్ బాటపట్టారు. ఇలా స్వల్ప స్కోరుకే టీమిండియా చేతులెత్తేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ కు 5 వికెట్లు దక్కగా... గ్రాండ్ హోమ్ కు 3, ఆస్ట్లే, నీషామ్ లకు చెరో వికెట్ దక్కాయి.