కొలంబో/శ్రీలంక: కొలంబోలో జరుగుతున్న నిదహాస్ ట్రోఫీ టీ-20 ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఆదివారం భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ నాలుగు మ్యాచ్‌లలో మూడింట్లో గెలుపొంది, ఒకదాన్లో ఓటమి చెంది ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. బంగ్లాదేశ్ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో రెండింట్లో గెలిచి, రెండింట్లో ఓడిపోయి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టు ఓడిపోయి ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒకదాన్లో గెలిచి, మిగిలిన మూడింట్లో ఓడిపోయి రెండు పాయింట్లు సాధించి చివరి స్థానంలో ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తుదిపోరులో టీమిండియాలో మహ్మద్ సిరాజ్‌కు విశ్రాంతినిచ్చి అతని స్థానంలో జయదేవ్ ఉనద్కత్‌కు చోటు కల్పించారు. ఈ ఒక్క మార్పు మినహా జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. బంగ్లాదేశ్‌లో ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండా ఉన్న టీమ్‌తోనే మైదానంలో దిగుతోంది. ఈ జట్టులో ముస్త్ఫికర్ రహీం, మహ్మదుల్లా వంటివారు బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు.


టీమిండియాలో కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేష్ రైనా, ఎల్.కే.రాహుల్, దినేష్ కార్తీక్ వంటి బ్యాట్స్‌మెన్‌లు.. వీరికి తోడు యుజ్వేంద్ర చాహల్, జయదేవ్ ఉనద్కత్ వంటివారు తమ బౌలింగ్‌లో ప్రత్యర్థులను హడలెత్తించడానికి సిద్ధంగా ఉన్నారు.


ఇరు జట్ల వివరాలు:


భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, సురేష్ రైనా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), లోకేష్ రాహుల్, మనీష్ పాండే, విజయ్ శంకర్, వాషింగ్టన్ సుందర్, శ్రాద్ధూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, రిషబ్ పంత్.


బంగ్లాదేశ్ జట్టు: షకీబ్ ఆల్ హసన్ (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, లిటోన్ దాస్, షబ్బీర్ రహ్మాన్, ముస్త్ఫికర్ రహీం (వికెట్ కీపర్), సౌమ్యా సర్కార్, మహ్మదుల్లా, మెహిదీ హసన్, ముస్త్ఫాజుర్ రహ్మాన్, రోబెల్ హోస్సేన్, నజాముల్ ఇస్లామ్, అబూ జయదేవ్, తస్కిన్ అహ్మద్, నూరుల్ హసన్.