Nikhat Zareen Wins Gold Medal: బాక్సింగ్‌లో వరల్డ్ ఛాంపియన్, తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్‌ని అభినందించిన కేసీఆర్
Nikhat Zareen Wins Gold Medal: బాక్సింగ్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ సాధించిన నిఖత్ జరీన్‌ని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ వేదికపై భారత జండాను రెపరెపలాడించిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్‌ను సీఎం కేసిఆర్ మనస్ఫూర్తిగా అభినందించారు.
Nikhat Zareen Wins Gold Medal: ప్రతిష్టాత్మక ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ సాధించిన అద్భుతమైన విజయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కొనియాడారు. బాక్సింగ్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ సాధించిన నిఖత్ జరీన్‌ని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ వేదికపై భారత జండాను రెపరెపలాడించిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్‌ను సీఎం కేసిఆర్ ట్విటర్ ద్వారా అభినందించారు.
ప్రభుత్వం అందించిన ప్రోత్సాహాన్ని నిఖత్ జరీన్ సద్వినియోగం చేసుకున్నారని.. అందువల్లే బాక్సింగ్ క్రీడలో ఆమె విశ్వ విజేతగా నిలిచారని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. జరీన్ భారత్‌కి గోల్డ్ మెడల్ అందించడం గర్వించదగిన విషయం అని పేర్కొన్నారు.
నిఖత్ జరీన్‌ని (Nikhat Zareen) అభినందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత క్రీడల్లో రాణించే విధంగా తెలంగాణలోని అన్ని గ్రామాల్లో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుచేస్తున్నట్టు సీఎం కేసిఆర్ ప్రకటించారు.
Also read : IPL 2022 Final: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ ఎప్పుడో తెలుసా?