మెల్‌బోర్న్: ఐపీఎల్‌లో ప్రయోజనాల కోసమే ఆస్ట్రేలియా క్రికెటర్లు భారత ఆటగాళ్లపై ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీని స్లెడ్జింగ్ చేయడానికి భయపడ్డారని మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ చేసిన ఆరోపణలపై పేస్ బౌలర్ పాట్ కమిన్స్ స్పందించాడు. భారత క్రికెటర్లతో దూకుడగా వ్యవహరించడం తగ్గించామనేది నిజమే కానీ, బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత ఆసీస్ జట్టులో పెను మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపాడు.  కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ రూ.15.5 కోట్లకు గతేడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో కమిన్స్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసీస్ వైస్ కెప్టెన్.. ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్ అయిన కమిన్స్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘క్లార్క్ చెప్పిన దాంట్లో సగం నిజం ఉంది. భారత క్రికెటర్లతో, విరాట్ కోహ్లీతో దూకుడుగా వ్యవహించకపోవడం.. స్లెడ్జింగ్‌కు దూరంగా ఉండటం నిజమే. అయితే కేవలం కొందరు ఆటగాళ్లు మాత్రమే ఐపీఎల్‌లో తమకు అవకాశాలు దక్కవని భారత క్రికెటర్లతో దూకుగా ఉండలేదు. బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత స్లెడ్జింగ్‌తో పాటు దూకుడును తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాం. జీవిత లక్ష్యాన్ని వెల్లడించిన స్టీవ్ స్మిత్.. పెద్ద కోరికనే!


మైదానంలో విజయం ఎంత ముఖ్యమో.. ఆటలో స్నేహితులను కోల్పోకుండా ప్రవర్తించడం కూడా అవసరమే. అయితే క్లార్క్ చెప్పినట్లుగా భారత క్రికెటర్లు, ముఖ్యంగా విరాట్ కోహ్లీకి తాము భయపడటం లాంటి వ్యాఖ్యల్లో నిజం లేదు. మరోవైపు బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ప్రధాన ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ జట్టుకు దూరం కావడంతో భారత్‌కు సొంతగడ్డపై సిరీస్‌ను కోల్పోయామని’ ఈ సందర్భంగా పాట్ కమిన్స్ గుర్తుచేశాడు. కరోనాపై పోరాటానికి రోహిత్ శర్మ భారీ విరాళం


అంతకుముందు ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్ సైతం ఈ వివాదంపై స్పందించాడు. ‘స్వదేశంలో భారత్ ఎంత ప్రమాదకర జట్టో అందరికీ తెలుసు. అందులోనూ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న కోహ్లీతో పెట్టుకోవడం ప్రత్యర్థి జట్టుకు అంత మంచిది కాదు. కానీ విరాట్‌కు బౌలింగ్ చేసినప్పుడు ఏ ఆసీస్ బౌలర్ కూడా ఐపీఎల్ గురించి మాత్రం ఆలోచించి ఉండడని’ పైన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos


మరోవైపు కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ వాయిదా పడింది. అసలు జరుగుతుందా లేదా అనే దానిపై ఇంకా నీలినీడలు తొలగిపోలేదు. త్వరగా కరోనా సమస్యను జయిస్తే ఆగస్టు, సెప్టెంబర్ మధ్య కాలంలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ


బుల్లితెర భామ టాప్ Bikini Photo