Arshad Nadeem: పట్టుదల.. దేశానికి పతకం తీసుకురావాలనే కసి ముందు అతడిని కష్టాల సుడిగుండాలను సులువుగా దాటేలా చేశాయి. ఆర్థిక స్థితి బాగా లేకపోతే గ్రామస్తులు చందాలు వేసుకుని మరి సహాయం చేశారు. గ్రామస్తుల నమ్మకం.. అతడి మొక్కవోని దీక్షకు ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడల్‌ వచ్చి వాలింది. మన గోల్డెన్‌ బాయ్‌ నీరజ్‌ చోప్రాను వెనక్కి నెట్టి స్వర్ణ పతకాన్ని ఎగురేసుకుపోయాడు. తన దేశానికి సుదీర్ఘ కాలంగా దక్కని గోల్డ్‌ మెడల్‌ను అందించాడు. అతడే అర్షద్‌ నదీమ్‌. ఒలింపిక్స్‌లో జావెలిన్‌ విభాగంలో చరిత్ర తిరగరాసేలా బల్లెం విసిరిన వీరుడు అర్షద్‌ నదీమ్‌ జీవితం చూస్తే అన్ని కష్టాలే కనిపిస్తాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. పురుషుల హకీలో కాంస్యం కైవసం


పారిస్‌ ఒలిపింక్స్‌లో బుధవారం జరిగిన జావెలిన్‌ త్రోలో 92.97 మీటర్ల దూరంలో బల్లెం విసిరి అర్షద్‌ నదీమ్‌ బంగారు పతకం ముద్దాడాడు. టోక్యో ఒలింపిక్స్‌ విజేత నీరజ్‌ చోప్రాకే గోల్డ్‌ మెడల్‌ అని అందరూ భావిస్తున్న తరుణంగా అనూహ్యంగా అర్షద్‌ నదీమ్‌ ఆ మెడల్‌ను చేజిక్కించుకున్నాడు. క్రీడా రంగం నివ్వెరపోయేలా చేసిన అర్షద్‌ నదీమ్‌ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. అతడి కఠోర శ్రమ.. కష్టాలు.. గ్రామస్తుల సహకారం వంటివి ఒక్క పాకిస్థాన్‌ ప్రజలకే కాదు ప్రపంచ ప్రజలందరికీ మంచి పాఠంగా పనికి వస్తుంది.

Also Read: Vinesh Phogat: చరిత్ర సృష్టించిన వినేశ్‌ ఫొగట్‌.. ఒలింపిక్స్‌లో ఫైనల్‌లోకి ప్రవేశం


ఎవరు అర్షద్‌ నదీమ్‌?
పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రం మియాన్‌ చాను ప్రాంతంలోని ఖనేవాల్‌ అనే గ్రామంలో అర్షద్‌ నదీమ్‌ 2 జనవరి 1997న జన్మించాడు. తండ్రి మహమ్మద్‌ అష్రాఫ్‌ భవన నిర్మాణ రంగంలో కూలీగా పని చేస్తుండేవాడు. మొత్తం ఏడుగురి సంతానంలో నదీమ్‌ మూడోవాడు. చిన్నప్పటి నుంచి క్రీడలు అంటే నదీమ్‌కు చాలా ఆసక్తి. మంచి క్రికెటర్‌ దాగి ఉన్నాడు. జిల్లా స్థాయిలో నదీమ్‌ మంచి బౌలర్‌గా రాణించాడు. కోచ్‌ రషీద్‌ అహ్మద్‌ సాకీ నదీమ్‌ను గుర్తించి శిక్ష ఇచ్చాడు. అతడి కుటుంబం ఎంతటి దీనావస్థలో ఉండేది అంటే ఏడాదిలో ఒక్కసారి మాత్రమే మాంసాహారం తినేంత గడ్డు పరిస్థితులు ఉండేవి.


ఒలింపిక్స్‌ లక్ష్యంగా నదీమ్‌ సన్నద్ధమయ్యాడు. అయితే ముందు షాట్‌పుట్‌, డిస్కస్‌ త్రోలో నదీమ్‌ ప్రయత్నాలు చేశాడు. కానీ జావెలిన్‌ త్రోలో సత్తా చాటడంతో దానిపై దృష్టి సారించాడు. పంజాబ్‌ యూత్‌ ఫెస్టివల్స్‌, ఇంటర్‌ బోర్డు మీట్‌లో వరుసగా స్వర్ణ పతకాలు కొల్లగొట్టడంతో ఒక్కసారిగా ఆ జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రతిభ చాటడంతో వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి ఉద్యోగ అవకాశాలు లభించాయి. కానీ వాటన్నింటిని తిరస్కరించాడు. పూర్తిస్థాయిలో జావెలిన్‌ త్రోపై దృష్టి సారించాడు.


గాయాలు, ఆర్థిక కష్టాలు
జావెలిన్‌ త్రోలో పూర్తి స్థాయి శిక్షణను 2015లో మొదలుపెట్టి కసరత్తు ప్రారంభించాడు. ఆ మరుసటి ఏడాది 2016లో జరిగిన ఆసియా క్రీడల్లో నీరజ్‌ చోప్రాతో పోటీపడగా.. కాంస్యంతో నదీమ్‌ సరిపెట్టుకున్నాడు.2022లో తొలిసారి 90 మీటర్ల మైలురాయిని దాటి కామన్‌వెల్త్‌ క్రీడల్లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. ఇక ఒలింపిక్స్‌ లక్ష్యంగా నదీమ్‌ సాధన ప్రారంభించగా కష్టాలు మాత్రం తగ్గలేదు. ఆర్థిక పరిస్థితులు బాగాలేక 2023 ఆసియా క్రీడల్లో నదీమ్‌ పాల్గొనలేకపోయాడు.

బల్లెం కూడా కొనలేని పరిస్థితి
ఆర్థిక పరిస్థితులే కాక అతడు సాధన చేయడానికి సరైన సౌకర్యాలు ఉండేవి కావు. అతడు వాడే జావెలిన్‌ త్రో బల్లెం కూడా పాడైంది. అది కొనలేక పాడైన బల్లెంతోనే సాధన చేశాడు. కొన్నిసార్లు అతడి పరిస్థితి చూసి స్వగ్రామంలోని ప్రజలు చందాలు వేసుకుని మరి డబ్బులు ఇచ్చేవారు. పారిస్‌ ఒలింపిక్స్‌కు వచ్చే మార్చి వరకు కూడా తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నాడు. పారిస్‌ ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రోలో గోల్డ్‌ మెడల్‌తో తన కల తీర్చుకున్నాడు. అతడి కలనే కాదు పాకిస్థాన్‌కు అందని ద్రాక్షగా ఉన్న ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడల్‌ తీసుకురావడం విశేషం. ఈ విజయంతో ఒక్కసారిగా నదీమ్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter