ఇద్దరు క్రికెట్ దిగ్గజాలకు ఈరోజు చాలా ప్రత్యేకం
క్రికెట్‌కే వన్నె తెచ్చిన ఇద్దరు క్రికెట్ దిగ్గజాలకు మరిచిపోలేని రోజు. ఒకరు బ్యాటింగ్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మాన్ (Don Bradman). మరొకరు భారతరత్నం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఆ విశేషాలు మీకోసం.
భారతీయులకు ఆగస్టు 15 ఎంత ప్రత్యేకమైన రోజన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆగస్టు 14 మాత్రం.. క్రికెట్‌కే వన్నె తెచ్చిన ఇద్దరు క్రికెట్ దిగ్గజాలకు మరిచిపోలేని రోజు. ఒకరు బ్యాటింగ్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మాన్ కాగా, మరొకరు భారతరత్నం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar). ఆ విశేషాలు మీకోసం. Sachin vs Shoaib Akhtar: ‘అక్తర్ బౌలింగ్ అంటే భయమే.. కానీ సచిన్ ఒప్పుకోడు’
1948లో ఇదే రోజున(ఆగస్టు 14) యాషెస్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఓవల్ మైదానంలో జరిగిన 5వ టెస్టులో తన కెరీర్‌లో చివరిసారి డాన్ బ్రాడ్‌మాన్ బ్యాటింగ్ చేశారు. ఈ సిరీస్‌ను ఇంగ్లాండ్‌పై 4-0 తేడాతో ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. చివరి ఇన్నింగ్స్ ఏ ఆటగాడికైనా చిరస్మరణీయమే. కెరీర్‌లో ఆయన బ్యాటింగ్ సగటు 99.9 కావడం విశేషం. COVID19 నుంచి కోలుకున్న భారత అరుదైన క్రికెటర్
మరోవైపు 1990లో ఇదే రోజున (ఆగస్టు 14న) సచిన్ టెండూల్కర్ తన తొలి టెస్టు శతకాన్ని (Sachin Tendulkar Scored Maiden Ton) బాదాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లాండ్‌పై జరిగిన టెస్టులో 5వ రోజు ఆటలో అజేయ శతకం (119) సాధించి భారత్‌ను ఓటమి నుంచి రక్షించాడు. 100 శతకాలు (వన్డేలు, టెస్టుల్లో కలిపి) సాధించినా ఈ శతకం మాత్రం సచిన్ కెరీర్‌లో ఎన్నటికీ ప్రత్యేకమే. CSK ఫిట్‌నెస్ క్యాంప్‌నకు రవీంద్ర జడేజా దూరం
అందాలతో బుసలు కొడుతున్న ‘నాగిని’ Nia Sharma Hot Photos
Photos: అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..