Australia Cricketer Ashton Agar Gets Death Threat: from India: టెస్ట్, వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఫిబ్రవరి 27న పాకిస్తాన్ చేరుకున్న విషయం తెలిసిందే. 1998లో పాకిస్థాన్‌లో చివరిసారిగా పర్యటించిన ఆసీస్.. 24 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టింది. ఈ పర్యటనలో పాక్, ఆసీస్ జట్లు మూడు టెస్టులు, మూడు వన్డేలు మరియు ఏకైక టీ20లో తలపడనున్నాయి. మార్చి 4న రావల్పిండిలో జరిగే మొదటి టెస్టుతో ఈ పర్యటన ఆరంభం కానుంది. అయితే పాక్ టూర్ ఆరంభానికి ముందే ఓ ఆసీస్ ఆటగాడికి బెదిరింపులు వచ్చాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాకిస్తాన్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తే నీ భ‌ర్త ప్రాణాల‌తో తిరిగిరాడంటూ ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్‌ ఆస్ట‌న్ అగ‌ర్‌ భార్యకు సోష‌ల్‌ మీడియా వేదిక‌గా బెదిరింపులు వచ్చాయి. 'ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్' వార్తల ప్రకారం.. అగర్ భార్య మాడెలైన్‌కు బెదిరింపు సందేశం వచ్చింది. 'మీ భర్త అష్టన్ అగర్‌ పాకిస్థాన్‌ పర్యటనకు వస్తే.. అతను సజీవంగా తిరిగి రాడు' అని మాడెలైన్‌కు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ బెదిరింపు పోస్ట్ వచ్చింది. వెంటనే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లకు అగర్ భార్య ఫిర్యాదు చేశారు. 


ఆస్ట‌న్ అగ‌ర్‌ భార్యకు వచ్చిన బెదిరింపు మెసెజ్‌పై సీఏ, పీసీబీ విచారణ జరిపాయి. ఆ నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా భారతదేశానికి చెందినదని తెలుస్తోంది. భార‌త్ కేంద్రంగా ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి అగ‌ర్‌ భార్యకు బెదిరింపు మెసేజ్‌ వచ్చినట్లు ప్రాధ‌మిక విచార‌ణ‌లో తేలిందని ఇరు జట్ల బోర్డులు పేర్కొన్నాయి. ఆ బెదిరింపు మెసేజ్‌ను అంత సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేశాయి. తన భార్యకు వచ్చిన బెదిరింపు సందేశాల గురించి పెద్దగా చింతించలేదని, పాక్ పర్యటనలో భాగంగా ఇక్కడకు వచ్చానని అగ‌ర్‌ తెలిపాడు. 


ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఫిబ్రవరి 27న పాకిస్థాన్ చేరుకుంది. బెరింపుల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఆస్ట్రేలియా జట్టుకు పూర్తి భద్రత కల్పించారు. హోటళ్లు, స్టేడియంలలో భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఆసీస్ టీమ్ బస్సుతో పాటు కమాండోలు, పోలీసు వాహనాలు కూడా ఉన్నాయి. ఇక టెస్టు సిరీస్‌కు ఆస్ట్రేలియా సన్నాహాలు ప్రారంభించింది. రావల్పిండిలో పాట్ కమిన్స్ సారథ్యంలోని జట్టు ప్రాక్టీస్ మొదలెట్టింది. ఈ పర్యటనలోని అన్ని మ్యాచ్‌లు రావల్పిండి, లాహోర్, కరాచీ మైదానాలలో మాత్రమే జరుగుతాయి.


Also Raed: LPG Cylinder Prices: భారీగా పెరిగిన గ్యాస్​ సిలిండ‌ర్ ధర.. నేటి నుంచే అమల్లోకి! వినియోగదారులకు చుక్కలే!!


Also Read: Gold Rate Today 1 March 2022: మగువలకు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధరలు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook