March 1st 2022 Gold and Silver Rates In Hyderabad: ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం చాలా రంగాలపై పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ముడిచమురు, పసిడి ధరలపై అధిక ప్రభావం చూపుతోంది. గత 3-4 రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు ఈరోజు (2022 మార్చి 1) ఒక్కసారిగా పెరిగాయి. 10 గ్రాముల బంగారంపై రూ. 720 పెరగగా.. కిలో వెండిపై రూ.1100 వరకు పెరిగింది. దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలను ఓసారి పరిశీలిద్దాం...
బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280లుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280గా కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ48,005 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280గా ఉంది.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 65,200లుగా ఉండగా.. ముంబైలో కిలో వెండి ధర రూ. 62,200 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 69,900గా ఉండగా.. విజయవాడ, విశాఖపట్నంలో కూడా అదే రేటు కొనసాగుతోంది.
Also Read: Horoscope March 1 2022: ఈ రోజు మహాశివరాత్రి.. కొన్ని రాశులకు అనుకూలం.. ఆ రాశులకు ప్రతికూలం
Also Read: Lost iPhone Found: పదేళ్ల క్రితం పోయిన ఐఫోన్ మళ్లీ ఇలా దొరికింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook