Pakistan Vs England Toss Updates: వరల్డ్ కప్‌ 2023 సెమీస్ రేసు నుంచి దాదాపు తప్పుకున్న పాకిస్థాన్.. ఇప్పుడు మొత్తానికే ఔట్ అయిపోయింది. ఎక్కడో మినుక్కుమినుక్కమంటున్న ఆశలపై ఇంగ్లాండ్‌ నీళ్లు చల్లింది. టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో పాక్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మొదట బ్యాటింగ్ చేసి ఉంటే కాస్త అవకాశా ఉండేవి. బౌలింగ్ కావడంతో అన్ని దారులు మూసుకుపోయాయి. మొదట బ్యాటింగ్‌లో ఇంగ్లాండ్ 50 పరుగులు చేస్తే.. 2 ఓవర్లలో ఛేదించాలి. 100 పరుగులు చేస్తే.. 2.5 ఓవర్లలో ఫినిష్‌ చేయాలి. 200 రన్స్ చేస్తే 4.3 ఓవర్లలో ఛేదించాలి. 300 రన్స్ చేస్తే 6.1 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ సమీకరణాలు అసాధ్యం కావడంతో టాస్ ఓటమితోనే పాక్ సెమీస్ రేసు నుంచి తప్పుకున్నట్లయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనివారం కోల్‌కతా ఈడెన్ గార్డెన్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ఇంగ్లాండ్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. పాక్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. హసన్ అలీ స్థానంలో షాదాబ్ ఖాన్ టీమ్‌లోకి వచ్చాడు.


"మేము మొదట బ్యాటింగ్ చేస్తాం. మంచి వికెట్‌గా కనిపిస్తోంది. కొంచెం పొడిగా ఉండడంతో సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాం. అదే టీమ్‌తో ఆడుతున్నాం. వరుస ఓటములకు చెక్ పెట్టడం ఎప్పుడైనా మంచిదే. మేము ప్రయత్నించి మాకు న్యాయం చేయడానికి చూస్తాము. డేవిడ్ విల్లీపై నేడు ఎమోషనల్ డే. అతను మాకు గొప్ ప్లేయర్. ఆటను ఆస్వాదిస్తాం.." అని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు.


"టాస్ గెలిస్తే.. మేము మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నాం. కానీ టాస్ మా చేతుల్లో లేదు. మాకు మంచి బౌలర్లు ఉన్నారు. ఇంగ్లాండ్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసేందుకు ప్రయత్నిస్తాం. జట్టులో ఒక మార్పు చేశాం. హసన్ అలీ ఆడటం లేదు. అతని స్థానంలో షాదాబ్ ఖాన్ వచ్చాడు. ఫఖర్ బ్యాటింగ్ కోసం ఎదురు చూస్తున్నాం. మా వంతు ప్రయత్నం చేస్తాం.." అని పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ తెలిపాడు. 


తుది జట్లు ఇలా..


ఇంగ్లాండ్: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్, కెప్టెన్), మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్


పాకిస్థాన్: అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, అఘా సల్మాన్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వాసిం జూనియర్, హరీస్ రవూఫ్.


Also Read: Unknown Facts About Chandra Mohan: చంద్రమోహన్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..ఆయనకు గుర్తింపు తెచ్చిన సినిమా ఇవే! 


Also Read:  Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook