A streaker interrupted during the New Zealand vs Pakistan 1st Test: సాధారణంగా కొన్ని ఫన్నీ సంఘటనలు మనం చూస్తుంటాం. అయితే అంతర్జాతీయ వేదికలు, మ్యాచ్‌ల మధ్యలో జరిగే ఘటనలు ఆశ్చర్యంతో పాటు నవ్వును తెప్పిస్తాయి. ఇటీవల పాకిస్తాన్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. తొలి టెస్టు మొదటిరోజునే జరిగిన ఓ అనూహ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



మౌంట్ మాంగనీ వేదికగా పాకిస్తాన్ (Pakistan)‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. మ్యాచ్ తొలిరోజు కివీస్ బ్యాటింగ్ చేస్తుండగా ఓ వీక్షకుడు ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా మైదానంలోకి పరుగెత్తుకొచ్చాడు. పైగా మైదానంలోకి వస్తూనే నగ్నంగా సెల్ఫీలు, వీడియోలు సైతం తీసుకోవడం గమనార్హం. అయితే అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ కావడంతో ఇది చర్చనీయాంశంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Tim Paine: ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పైన్ అరుదైన ఘనత



ఓ అభిమాని నగ్నంగా అలా స్టేడియంలోకి పరుగెత్తుకు రావడంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. బ్యాటింగ్ చేస్తున్న New Zealand బ్యాట్స్‌మెన్, ఫీల్డింగ్ చేస్తున్న పాక్ ఆటగాళ్లు మ్యాచ్ ఆపి, ఆ వ్యక్తి విచిత్ర చేష్టలను చూస్తుండిపోయారు. వెంటనే అప్రమ్తమైన గ్రౌండ్ స్టాఫ్ నగ్నంగా ఉన్న వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. వారిని తనకిష్టం వచ్చినట్లుగా కొద్దిసేపు పరుగెత్తించిన వ్యక్తి ఎట్టకేలకు మైదాన సిబ్బంది చేతికి చిక్కాడు.


Also Read: ​India Vs Australia 2nd Test Match Highlights: కెప్టెన్ అజింక్య రహానే అద్భుత శతకం.. రెండోరోజు టీమిండియాదే


 




మైదానంలో ఇది గమనిస్తున్న వీక్షకులు మొదట ఆశ్చర్యపోయినా, ఆ తర్వాత పగలబడి నవ్వుతూ ఈలలు వేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. గ్రౌండ్ స్టాఫ్ పనితీరుపై, ఆటగాళ్ల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి.


Also Read: Ajinkya Rahane కెప్టెన్సీపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వెల్లువ



కాగా, ఈ టెస్టులో సోమవారం మూడోరోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 431 పరుగులకు ఆలౌటైంది. పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో102.2 ఓవర్లలో 239 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో ఆతిథ్య కివీస్‌కు 192 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.


Also Read: PM Kisan Scheme: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ.. వివరాలు ఇలా చెక్ చేసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G  


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook