India Vs Australia 2nd Test Match Highlights: కెప్టెన్ అజింక్య రహానే అద్భుత శతకం.. రెండోరోజు టీమిండియాదే

Ajinkta Rahane Slams Century At MCG: రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ అజింక్య రహానే 195 బంతుల్లో శతకం సాధించాడు.

Last Updated : Dec 27, 2020, 02:23 PM IST
  • ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య రెండో టెస్టు మ్యాచ్
  • అజేయ శతకం సాధించిన భారత కెప్టెన్ అజింక్య రహానే
  • రెండో రోజు ఆటతో 82 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
India Vs Australia 2nd Test Match Highlights: కెప్టెన్ అజింక్య రహానే అద్భుత శతకం.. రెండోరోజు టీమిండియాదే

Ajinkta Rahane Slams Century At MCG: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ అజింక్య రహానే 195 బంతుల్లో శతకం సాధించాడు. 88వ ఓవర్, పాట్ కమిన్స్ బౌలింగ్‌లో నాలుగో బంతిని బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా బౌండరీకి తరలించడంతో రహానే శతకం పూర్తయింది. 

రహానే కెరీర్‌లో ఇది 12 శతకం, కాగా, మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో ఇది రహానే (Ajinkya Rahane)కు రెండో సెంచరీ. రెండోరోజు ఆట ముగిసే సమయానికి రహానే (104 నాటౌట్; 200 బంతుల్లో 12×4) బాధ్యతాయుత సెంచరీకి తోడు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(40 నాటౌట్; 104 బంతుల్లో 1×4) క్రీజులో ఉన్నారు. ఓపికగా ఆడుతూ భారత ఇన్నింగ్స్‌కు మరింత పటిష్టం చేశారు.

Also Read: Tim Paine: ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పైన్ అరుదైన ఘనత

ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. దీంతో ప్రస్తుతానికి టీమిండియా(Team India)‌ 82 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 195 పరుగులకే చాపచుట్టేసిన విషయం తెలిసిందే. ఓవర్ నైట్ స్కోరు 36/1తో ఆదివారం ఆట ప్రారంభించిన భారత్‌ను కమిన్స్ దెబ్బతీశాడు. దాంతో మరో 29 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది.

Also Read: Ajinkya Rahane కెప్టెన్సీపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వెల్లువ

అరంగేట్ర ఆటగాడు శుభ్‌మన్ గిల్ (45) తొలి అర్ధశతకం చేజార్చుకున్నాడు, చతేశ్వర్ పుజారా(17) , హనుమ విహారి(21), రిషబ్ పంత్(29) పరుగులు చేశారు. విహారి, పంత్‌లతో కలిసి రెండు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన రహానే, జడేజాతో కలిసి అజేయ శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.

Also Read: PM Kisan Scheme: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ.. వివరాలు ఇలా చెక్ చేసుకోండి
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G  

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News