PAK vs WI: విండీస్‌కు భారీ షాక్.. ముగ్గురు స్టార్ ఆటగాళ్లకు కరోనా!!
పాకిస్తాన్ పర్యటనకు ముందు వెస్టిండీస్ జట్టుకు భారీ తగిలింది. విండీస్ జట్టులోని ముగ్గురు స్టార్ ఆటగాళ్లకు కరోనా సోకింది. వీరితో పాటు జట్టు సిబ్బందిలో ఒకరికి కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
PAk vs WI: Three West Indies cricketers tested positive for Coronavirus: పాకిస్తాన్ (Pakistan) పర్యటనకు ముందు వెస్టిండీస్ (West Indies) జట్టుకు భారీ తగిలింది. విండీస్ జట్టులోని ముగ్గురు స్టార్ ఆటగాళ్లకు కరోనా (Coronavirus) సోకింది. వీరితో పాటు జట్టు సిబ్బందిలో ఒకరికి కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విండీస్ ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ మరియు ఆల్‌రౌండర్లు రోస్టన్ చేజ్, కైల్ మేయర్స్ వైరస్ బారిన పడ్డారు. వీరందరు ప్రస్తుతం ఐసొలేషన్‌లో ఉన్నారు. దాంతో వచ్చే వారం నుంచి పాకిస్తాన్‌తో ప్రారంభమయ్యే పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరం అయ్యారు. ప్లేయర్స్ అందరికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయట.
పాకిస్థాన్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు వెస్టిండీస్ జట్టు గురువారం (డిసెంబర్ 9) కరాచీకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. రోస్టన్ ఛేజ్ ( Roston Chase), షెల్డన్ కాట్రెల్ (Sheldon Cottrell ), కైల్ మేయర్స్ (Kyle Mayers)తో పాటు జట్టు సిబ్బందిలో ఓ వ్యక్తి వైరస్ బారినపడినట్లు తేలింది. ఈ నలుగురిని ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉంచామని విండీస్ క్రికెట్ బోర్డు (WCI)ఓ ప్రకటనలో తెలిపింది. మిగతా ఆటగాళ్లు అందరికీ నెగెటివ్‌గా రావడంతో ఈరోజు నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు. కరోనా కేసులు నమోదైనా సిరీస్ షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని విండీస్ బోర్డు వెల్లడించింది.
Also Read: Road Accident: లారీని ఢీకొట్టిన కారు-ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి
వెస్టిండీస్, పాకిస్తాన్ (PAk vs WI) జట్ల మధ్య డిసెంబర్ 13న పర్యటన ఆరంభమై.. 22తో ముగుస్తుంది. ఈ పర్యటనలో ఇరు జట్లు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నాయి. డిసెంబర్ 13న మొదటి టీ20, 14న రెండో టీ20, 16న మూడో టీ20 జరగనున్నాయి. అన్ని టీ20లు కరాచీ (Karachi)లో సాయత్రం 6.30 గంటలకు ప్రారంభం అవుతాయి. డిసెంబర్ 18న మొదటి వన్డే, 20న రెండో వన్డే, 22న మూడో వన్డే కరాచీలో జరగనున్నాయి. మూడు వన్డేలు మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం కానున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook