ODI World Cup 2023-Pakistan team: వన్డే వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ విజయాలు సాధించాలనుకున్న పాకిస్థాన్ కు భారత్ అడ్డుకట్ట వేసింది. నెదర్లాండ్స్, శ్రీలంకపై సులువుగా గెలిచిన దాయాది జట్టు టీమిండియాపై మాత్రం చేతులెత్తిసింది. అక్టోబరు 14న భారత్ తో మ్యాచ్ లో అన్ని విభాగాల్లో విఫలమైంది పాక్. చిరకాల ప్రత్యర్థి తదుపరి మ్యాచ్ (అక్టోబరు 20)లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ప్రస్తుతం పాకిస్థాన్ రెండు విజయాలతోనూ, ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ గెలుపుతోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్ ను రెండు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఈ రెండు జట్ల పోరుకు ముందు పాకిస్తాన్ జట్టును వైరల్ ఫీవర్ పట్టిపీడిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాకిస్థాన్ ఆటగాళ్లు షహిన్ షా అఫ్రిది, అబ్దుల్లా షఫీక్, ఉసామా మీర్ వైరల్ ఫీవర్‌ బారిన పడినట్టు తెలుస్తోంది. దీంతో టీమ్ ప్రాక్టీస్‍కు ఇబ్బందిగా మారినట్లు సమాచారం. రీసెంట్ గా జట్టులోని కొందరికి జ్వరం వచ్చింది.. అందులో కొందరు కోలుకున్నారు. ఇంకా కొంతమంది ఆటగాళ్లు జ్వరంతో బాధపడుతున్నట్లు పాకిస్థాన్ టీమ్ మేనేజ్‍మెంట్ తెలిపింది. ఇప్పటికే దాయాది ఆటగాళ్లకు  డెంగ్యూ, కొవిడ్-19 పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆటగాళ్లకు సాధారణ జ్వరమే వచ్చిందని, ఆస్ట్రేలియా మ్యాచ్ కల్లా కోలుకుంటారని మేనేజ్‍మెంట్ భావిస్తోంది. ఇప్పటికే ప్లేయర్లకు జ్వరం వల్ల ఓ ప్రాక్టీస్ సెషన్‍ను పాక్ క్యాన్సిల్ చేసుకుంది. అక్టోబర్ 20న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా పాక్ - ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనుంది. 



Also Read: ODI WC 2023 Points Table: వరల్డ్ కప్ లో టాప్ టీమ్స్, టాప్ బ్యాటర్స్, టాప్ బౌలర్స్ లిస్ట్ ఇదే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook