Shoaib Akhtar: టీ20 ప్రపంచకప్ 2021లో ఇవాళ కీలకమైన రెండవ సెమీఫైనల్ ఉంది. గ్రూప్ 2 టాపర్ పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌పై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అంత ఈజీ కాదంటున్నాడు మరి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ICC T20 World Cup 2021లో కీలకమైన పోరు నేడు జరగనుంది. ఇప్పటికే తొలిసారిగా టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు న్యూజిలాండ్ చేరగా..మరో ఫైనలిస్ట్ కోసం పాకిస్తాన్, ఆస్ట్రేలియాలు తలపడనున్నాయి. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ సారధ్యంలో 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. జేమ్స్ నీషమ్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఏ మాత్రం అంచనాల్లేకుండా ప్రపంచకప్ బరిలో దిగిన న్యూజిలాండ్ అందర్నీ ఆశ్యర్చపరుస్తూ ఫైనల్‌కు చేరింది. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 


ఆస్ట్రేలియాతో(Australia)మ్యాచ్ అంటే అంత ఈజీ కాదని చెబుతున్నాడు షోయబ్ అఖ్తర్(Shoaib Akhtar). ఆసీస్‌తో పోరు నల్లేరు మీద నడక కాదని షోయబ్ స్పష్టం చేశాడు. ఫైనల్‌కు చేరాలంటే ఆసీస్‌తో జరిగే అగ్నిపరీక్షను ఎదుర్కోవల్సిందేనంటున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌పై వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ సారధి మోర్గాన్ కెప్టెన్సీ అస్సలు బాగాలేదని..బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదని షోయబ్ అభిప్రాయపడ్డాడు. లివింగ్ స్టోన్, మోర్గాన్‌లు కాస్త ముందే బరిలో దిగుంటే..జట్టు స్కోరు 170-175కు చేరుండేదన్నాడు. ఫైనల్‌లో న్యూజిలాండ్ - పాకిస్తాన్(Newzealand vs pakistan)తలపడితే చూడాలనుందని చెప్పాడు. మోర్గాన్ వ్యూహంపై విమర్శలు చేశాడు. లక్ష్యసాధన సమయంలో ఆదిల్ రషీద్‌తో 17వ ఓవర్ వేయిస్తే బాగుండేదనేది అఖ్తర్ వాదన. అలా చేయకపోవడంతో మ్యాచ్ న్యూజిలాండ్(Newzealand) వైపుకు వెళ్లిందంటున్నాడు. అదే సమయంలో ఇవాళ అంటే నవంబర్ 11న జరగనున్న సెమీఫైనల్‌లో పాకిస్తాన్(Pakistan) అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించాడు.


Also read: Australia vs Pakistan: ఆస్ట్రేలియాతో మ్యాచుకు ముందు పాకిస్తాన్ జట్టుకు షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లు మ్యాచుకు దూరం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook