Pakistan Pacer Zaman Khan Challenges India Bowler Umran Malik: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా వెలుగులోకి వచ్చిన బౌలర్లలో 'ఉమ్రాన్ మాలిక్' ఒకడు. తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తరఫున ఆడుతూ మంచి ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ 2021, ఐపీఎల్ 2022లో ఉమ్రాన్ తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్‌లకు చుక్కలు చూపించాడు. నిలకడగా 150 కిమీ వేగంతో బంతులు వేస్తూ.. టాప్ బ్యాటర్లను సైతం బెంబేలెత్తించాడు. 157 వేగంతో బంతిని సంధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ టోర్నీలో సత్తాచాటుతూ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే కాశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వేగవంతమైన బంతులు సంధిస్తూ పత్యర్ది బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇటీవలే శ్రీలంక‌తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో 156 కిమీ వేగంతో బంతిని విసిరాడు. దీంతో వన్డేల్లో భారత్‌ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. లంకతో జరిగిన టీ20 సిరీస్‌లో 155 కిమీ వేగంతో బంతిని విసిరి.. పొట్టి ఫార్మాట్‌లో కూడా అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన భారత బౌలర్‌గా నిలిచాడు.


అయితే ఉమ్రాన్‌ మాలిక్‌తో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ జమాన్ ఖాన్ పోల్చుకున్నాడు. ఉమ్రాన్‌ ఫాస్టెస్ట్ బాల్ రికార్డును బ్రేక్ చేస్తా అంటూ ఛాలెంజ్‌ విసిరాడు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) 2023లో ఆ రికార్డు బ్రేక్‌ చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. పాక్ టీవీ.టీవీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో జమాన్ మాట్లాడుతూ... 'నేను పేస్ గురించి అసలు పట్టించుకోను. కేవలం ప్రదర్శనలపైనే దృష్టి వహిస్తాను. అంతిమంగా పనితీరు ముఖ్యం. పేస్ సహజంగానే ఉంటుంది' అని పేర్కొన్నాడు. 



పీఎస్‌ఎల్‌లో లాహోర్ క్వాలండర్స్‌కు జమాన్‌ ఖాన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు 30 టీ20లు ఆడిన జమాన్‌.. 40 వికెట్లు తీశాడు. ఎకానమీ రేటు 8.26గా ఉంది. పీఎస్‌ఎల్‌ 2022లో 18 వికెట్లు తీసిన తర్వాత 'ఎమర్జింగ్ క్రికెటర్‌'గా కూడా ఎంపికయ్యాడు. దేశీవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న 21 ఏళ్ల జమాన్‌.. పాకిస్తాన్‌ జాతీయ జట్టు తరపున అరంగేట్రం చేసేందుకు ఎదురుచూస్తున్నాడు. ఫిబ్రవరి 13 నుంచి మార్చి 19 వరకు పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 ఎడిషన్ జరగనుంది. 


Also Read: IND vs AUS: 2-1తో బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ ఆ జట్టే గెలుస్తుంది.. మహేల జయవర్దనే జోస్యం!  


Also Read: Allu Aravind : విజయ్ వల్లే ఇదంతా జరిగిందా?.. అల్లు అరవింద్‌కు క్షమాపణలు చెప్పారా?.. అసలు ఏం జరిగిందంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.