Pakistan former Captain Inzamam Ul Haq Suffers heart Attack: పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ మాజీ కెప్టెన్ ఇంజమామ్‌-ఉల్‌-హక్‌కు గుండెపోటుకు గురయ్యారు. హుటాహుటిన లాహోర్ లోని  ఆసుపత్రిలో చేర్పించగానే ఆంజియోప్లాస్టి చేశారు. ఆపరేషన్ విజయవంతంగా  పూర్తయిందని, ఇంజమామ్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే విషయం తెలుసుకున్న ఇంజమామ్‌, బంధువులు, అభిమానుల, ఆప్తులు ఆందోళనలకు గురవుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంజమామ్ అభిమానులు ట్విట్టర్ లో 'నువ్వు త‍్వరగా కోలుకోవాలి, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలి' అని కోరుకుంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆకాంక్షించారు. 


Also Read: Bypolls Schedule: హుజూరాబాద్, బద్వేల్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల




1992 లో వరల్డ్‌కప్‌ గెలిచిన పాకిస్తాన్ జట్టు సభ్యుడైన ఇంజమామ్‌ దేశంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఇది వరకు పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న ఇంజమామ్ రిటైర్మెంట్ తరువాత సొంతంగా ఉన్న యూట్యూబ్ ఛానెల్ ద్వారా క్రికెట్‌ విశ్లేషణలతో అభిమానులకు టచ్‌లో ఉంటున్నాడు. 


1991లో మొదటిసారిగా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి ఆరంగేట్రం చేసిన ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ 120 టెస్టులు ఆడి 25 సెంచరీలతో  8830 పరుగులు చేసాడు ఇక వన్డే విషయానికి వస్తే, 378 వన్డేలు ఆడిన ఇంజమామ్‌ 10 సెంచరీలు చేసి 11739 పరుగులు చేసాడు. పాకిస్థాన్ జట్టులో వన్డేలలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ పేరొందాడు. 




Also Read: Liger Movie Update: విజయ్ దేవరకొండ 'లైగర్’ సినిమాలో ఐరన్ మైక్ టైసన్


2007లో ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్ నుండి రిటైర్ అయ్యాక, పదవి విరమణ తరువాత కూడా పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు తనదైన శైలిలో సేవలను అందించాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో పలు ఉన్నతమైన పదవులను కూడా నిర్వహించాడు. అభిమానులే కాకుండా పలువురు మాజీ క్రికెటర్లు కూడా ఇంజమామ్ కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి