Paris Olympics 2024: పారిస్ వేదికగా జరుగుతున్న 2024 ఒలింపిక్స్ లో మెడల్స్ వేట షురూ అయ్యింది. ఇండియాకు ఎన్నో ఆశలు ఉన్న షూటింగ్ లో భారత షూటర్ 22  మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌కు అర్హత సాధించింది. పారిస్ 2024 ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయురాలు ఆమె. ఆమె 580-27x స్కోరుతో 3వ స్థానంలో నిలిచింది. క్యాలిఫికేషన్ రౌండులో 580 పాయింట్లతో మూడో స్థానలో నిలిచిన మనుభాకర్..ఫైనల్ కు క్వాలిఫై అయ్యింది. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్యాలిఫికేషన్ లో మరో భారత షూటర్ రిథమ్ సంగ్వాన్ 573 పాయింట్లతో 15వ స్థానికి పరిమితం అయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో తొలిరోజు షూటింగ్ లో భారత ఈవెంట్స్ పూర్తయ్యాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్ జులై 28 ( ఆదివారం) మధ్యాహ్నం 3.30గంటలకు షురూ అవుతుంది.  ఇందులో మను క్వాలిఫికేషన్ రౌండ్‌లో మొదటి స్థానంలో నిలిచిన హంగేరి క్రీడాకారిణి మేజర్ వెరోనికా, రెండో స్థానంలో నిలిచిన హో యే జిన్‌ల నుంచి గట్టి పోటీని ఎదుర్కోనే అవకాశం ఉంది.కాగా ఇంతకుముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ఎలవెనిన్ వలరివన్, సందీప్ సింగ్, రిమిత, అర్జున్ జబుతా జోడులు నిరాశపరిచాయి. కాగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో సరబ్ జోత్ సింగ్, అర్జున్ చీమా కూడా పైనల్ కు చేరుకోలేకపోయారు. 





Also Read : National Pension Sceme: NPS పథకంలో వచ్చిన మార్పులు ఇవే...ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు మీ కోసం.. 


 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter