Neeraj Chopra at Paris 2024 Olympics: కోట్లాది మంది భారతీయుల ఆశలు మోస్తూ బల్లెం వీరుడు, గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా నేడు జావెలిన్ త్రో క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో ఆడనున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో పతకాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో దేశ ప్రజలందరి ఆశలు నీరజ్‌పైనే ఉన్నాయి. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి సంచలనం సృష్టించిన నీరజ్ చోప్రా.. మరోసారి అలాంటి ప్రదర్శనే చేసేందుకు భారీగా కసరత్తు చేసి వచ్చాడు. పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్ Aలో కిషోర్ జెనా పాల్గొంటుండగా.. గ్రూప్ Bలో నీరజ్ చోప్రా పాల్గొంటాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Big Alert: రేపు బ్యాంకులకు సెలవు..? ఎందుకో ముందుగానే తెలుసుకోండి..!   


పారిస్ ఒలింపిక్స్‌లో అన్ని దేశాలు సత్తాచాటుతున్నా భారత ఆటగాళ్ల ప్రదర్శన మాత్రం చెప్పుకొదగ్గస్థాయిలో లేదు. ఇప్పటివరకు భారత ఖాతాలో మూడు పతకాలు చేరగా.. ఆ మూడు కూడా షూటింగ్‌లో వచ్చినవే. అందులో రెండు పతకాలు మను భాకర్ సాధించినవే ఉన్నాయి. ఈ మూడు పతకాలు కూడా కాంస్యమే కావడంతో గోల్డ్ మెడల్ కోసం భారతీయులు ఆశగా ఎదురుచూస్తున్నారు. బాక్సింగ్, ఆర్చరీ, బ్యాడ్మింటన్‌లో కచ్చితంగా పతకాలు వస్తాయనుకుంటే.. ఆటగాళ్లు విఫలమయ్యారు. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ నీరజ్‌ చోప్రాపై ఎక్స్‌పెటేషన్స్‌ మరింత పెరిగిపోయాయి. కచ్చితంగా పతకం సాధిస్తాడని కోట్లాది మంది అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు.


టోక్యో 2020 ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించిన తరువాత.. నిలకడగా రాణిస్తున్నాడు. గతేడాది ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్ కోసం ఎంతోగానో ఎదురుచూస్తున్న నీరజ్ చోప్రా.. ఎక్కువగా గాయాల బారిన పడకుండా తక్కువ సంఖ్యలోనే టోర్నీల్లో పాల్గొంటున్నాడు. ఎలాగైనా గోల్డ్ మెడల్ అందించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. నీరజ్‌ చోప్రాతోపాటు జావెలిన్ త్రోలో కిశోర్ కుమార్ బరిలోకి దిగుతున్నాడు.


జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్‌లో 32 మంది అథ్లెట్లు ఉండగా.. వీరిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు A లో కిశోర్ కుమార్, గ్రూప్ B లో నీరజ్ చోప్రా ఉన్నాడు. రెండు గ్రూపుల నుంచి 84 మీటర్ల దూరం బల్లెం విసిరిన 12 మంది ఫైనల్‌లో ఎంట్రీ ఇస్తారు. 12 కంటే ఎక్కువ మంది 84 మీటర్ల త్రో విసిరితే.. టాప్-12ను ఫైనల్‌కు ఎంపిక చేస్తారు. గురువారం ఫైనల్ పోరు ఉంటుంది.


ఒలింపిక్స్‌లో భారత్ షెడ్యూల్ ఇలా..


==> 1:30 PM - టేబుల్ టెన్నిస్ - పురుషుల జట్టు - రౌండ్ ఆఫ్ 16 - భారత్ vs చైనా
==> 1:50 PM - అథ్లెటిక్స్ - పురుషుల జావెలిన్ త్రో - క్వాలిఫికేషన్‌ - గ్రూప్ A - కిషోర్ జెనా
==> 2:30 PM - రెజ్లింగ్ - మహిళల 68kg ఫ్రీస్టైల్ - రెపెచేజ్ (అర్హత సాధిస్తే) – నిషా దహియా vs TBD
==> 2:50 PM - అథ్లెటిక్స్ - మహిళల 400m రెపెచేజ్ - హీట్ 1 కిరణ్ పహల్
==> 3 PM - రెజ్లింగ్ - మహిళల 50kg ఫ్రీస్టైల్ - 1/8 ఫైనల్స్ - వినేష్ ఫోగాట్ vs TBD
==> 3:20 PM - అథ్లెటిక్స్ - పురుషుల జావెలిన్ త్రో - క్వాలిఫికేషన్ గ్రూప్ A - నీరజ్ చోప్రా
==> 4:20 PM నుంచి - రెజ్లింగ్ - మహిళల 50kg ఫ్రీస్టైల్ - 1/4 ఫైనల్స్ (అర్హత సాధిస్తే) - వినేష్ ఫోగాట్ vs TBD
==> 6:30 PM లేదా 11:30 PM సెషన్ - టేబుల్ టెన్నిస్ - మహిళల టీమ్ క్వార్టర్ ఫైనల్ - భారత్ vs USA లేదా జర్మనీ
==> 10:25 PM - రెజ్లింగ్ - మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ - సెమీఫైనల్ (క్వాలిఫై అయితే) వినేష్ ఫోగాట్ vs TBD
==> 10:30 PM - హాకీ - పురుషుల టీమ్ సెమీస్ - భారత్ vs జర్మనీ


Also Read: Stock market crashes:స్టాక్ మార్కెట్లలో రక్త పాతం...రూ. 10 లక్షల కోట్ల సొమ్ము ఆవిరి..కారణాలు ఇవే..!!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.