Punjab Kings Vs Delhi Capitals Match Full Highlights: పంజాబ్ కింగ్స్ గెలుపుతో ఐపీఎల్ 2024 సీజన్‌ను ఆరంభించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. మొహలీలోని మహారాజా యదవీందర్ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. షై హోప్ (33), డేవిడ్ వార్నర్ (29) రాణించగా.. చివర్లో అభిషేక్ పారెల్ (32) మెరుపులు మెరిపించాడు. హర్షల్ పటేల్ వేసిన 20 ఓవర్‌లో ఏకంగా 25 పరుగులు చేయడంతో ఢిల్లీ స్కోరు 170 రన్స్ దాటింది. రీఎంట్రీ మ్యాచ్‌లో రిషబ్ పంత్ 18 రన్స్ చేశాడు. అనంతరం పంజాబ్ ఆరు వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. సామ్ కర్రాన్ (63) హాఫ్ సెంచరీ బాదగా.. లివింగ్‌స్టోన్ (38 నాటౌట్) చివరి వరకు క్రీజ్‌లో నిలబడి జట్టును గెలిపించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Family Star: ఫ్యామిలీ స్టార్ కథ బయటపెట్టిన దిల్ రాజు.. సినిమాకి అందుకే ఆ పేరు!


ఢిల్లీ విధించిన 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌.. దూకుడు ఇన్నింగ్స్ ఆరంభించింది. నాలుగో ఓవర్‌లో ఇషాంత్ శర్మ దెబ్బ తీశాడు. కెప్టెన్ శిఖర్ ధావన్ (22)ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో పాటు.. బెయిర్ స్టో (9) రనౌట్‌కు కారణమయ్యాడు. ప్రభుసిమ్రాన్ సింగ్ (26)తో కలిసి సామ్ కర్రాన్ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. 84 పరుగుల వద్ద ప్రభును కుల్దీప్ యాదవ్ పెవిలియన్‌కు పంపించాడు. జితేశ్ శర్మ (9) కూడా ఎక్కువసేపు క్రీజ్‌లో నిలవలేదు. ఆ తరువాత లివింగ్ స్టోన్‌తో కలిసి సామ్ కర్రాన్ ఢిల్లీ బౌలర్లకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇద్దరు వరుసగా బౌండరీలు బాదుతూ లక్ష్యాన్ని కరిగించారు. చివర్లో కర్రాన్ (47 బంతుల్లో 63, 6 ఫోర్లు, ఒక సిక్స్), శంకర్ సింగ్ (0) ఔట్ అయినా.. అప్పటికే ఢిల్లీ విజయం ఖాయమైపోయింది. చివరి ఓవర్‌లో సిక్సర్‌తో లివింగ్‌స్టోన్ మ్యాచ్‌ను ముగించాడు.


అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ఆరంభించిన ఢిల్లీకి ఓపెనర్ల డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వార్నర్ 21 బంతుల్లో 29 పరుగులు, మార్ష్ 12 బంతుల్లో 20 పరుగులతో వేగంగా ఆడారు. రీఎంట్రీ ఇచ్చిన రిషభ్‌ పంత్ 13 బంతుల్లో 18 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. షైయ్ హోప్ (25 బంతుల్లో 33) రాణించాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అభిషేక్ పోరెల్ బ్యాటింగ్‌లో దుమ్ములేపాడు. కేవలం 10 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 25 పరుగులు పిండుకున్నాడు.


Also Read:  V Hanumanth Rao: రేవంత్ రెడ్డి రెండు సైడ్ లు వినాలే.. సంచలన వ్యాఖ్యలు చేసిన వీ.హనుమంత రావు..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter