PBKS vs GT Playing 11 is Out: ఐపీఎల్ 2022లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు వేళయింది. మంచి ఫామ్‌లో ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య పోరు మరి కాసేపట్లో ఆరంభం కానుంది. టాస్‌ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచులో గుజరాత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు చెప్పాడు. విజయ్ శంకర్, వరుణ్ ఆరోన్ స్థానాల్లో సాయి సుదర్శన్, దర్శన్‌ నల్కండే తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు పంజాబ్‌ ఒక మార్పు చేసినట్టు సారథి మయాంక్ అగర్వాల్ చెప్పాడు. భానుక రాజపక్స స్థానంలో జానీ బెయిర్‌స్టో ఆడుతున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటి వరకు గుజరాత్‌ టైటాన్స్‌ ఒక్క మ్యాచులోనూ ఓడిపోలేదు. ఆడిన రెండింట్లోనూ గెలుపొందింది. దాంతో హ్యాట్రిక్ విజయం హార్దిక్ సేన కన్నేసింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ మూడింట్లో రెండు మ్యాచుల్లో విజయం సాధించింది. జానీ బెయిర్‌స్టో జట్టులోకి రావడంతో పంజాబ్ బ్యాటింగ్ బలం అమాంతం పెరిగింది. ముంబైలోని బ్రాబౌర్న్ మైదానం వేదికగా జరుగనున్న ఈ మ్యాచులో ఏ జట్టు ఆదిపత్యం చెలాయిస్తుందో చూడాలి.



తుది జట్లు
పంజాబ్‌ కింగ్స్:  మయాంక్‌ అగర్వాల్ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్‌, జితేశ్ శర్మ, షారుఖ్‌ ఖాన్‌, ఓడియన్ స్మిత్‌, కగిసో రబాడ, రాహుల్ చహర్‌, వైభవ్‌ అరోరా, అర్ష్‌దీప్ సింగ్‌. 
గుజరాత్‌ టైటాన్స్‌:  మాథ్యూ వేడ్‌, శుభ్‌మన్‌ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్‌ ఖాన్‌, లాకీ ఫెర్గూసన్‌, మహమ్మద్‌ షమీ, దర్శన్‌ నల్కండే. 


Also Read: Yami Gautam: ఇప్పటివరకూ మీ పోర్టల్‌ని ఫాలో అయ్యేదాన్ని.. ఇకపై కాను! రివ్యూపై యామీ గౌతమ్ ఆగ్రహం


Also Read: Yuzvendra Chahal: ఆ క్రికెటర్ ఫుల్‌గా తాగి.. 15వ అంతస్థు నుంచి నన్ను తోసేయ‌బోయాడు: చహల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook