PAK fan rquest to Virat Kohli in Pakistan vs England Match: టీమిండియా మాజీ కెప్టెన్ 'విరాట్ కోహ్లీ' గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోహ్లీ మైదానంలోకి దిగాడంటే.. పరుగుల వరద పారాల్సిందే, రికార్డుల మోత మోగాల్సిందే. తొలుత బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్‌కు దిగినా భారీ ఇన్నింగ్స్ ఆడుతాడు. ఇక హాఫ్ సెంచరీలు, సెంచరీలను కూడా మంచినీరు తాగినంత సులువుగా చేస్తుంటాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో 71 శతకాలు బాదిన ఘనత కోహ్లీకి ఉంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (100) తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ కోహ్లీనే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విరాట్‌ కోహ్లీకి ఉన్న క్రేజ్‌ అంతాఇంతా కాదు. కేవలం భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోహ్లీకి ఫాన్స్ ఉన్నారు. దాయాది దేశం పాకిస్తాన్‌లో కూడా డై హార్డ్ ఫాన్స్ ఉన్నారు. తాజాగా ఓ పాక్ ఫ్యాన్ విరాట్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. శుక్రవారం లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఇంగ్లండ్‌, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో పాక్ అభిమాని ప్లకార్డ్‌ పట్టుకుని తన కోరిక నెరవేర్చమని కోహ్లీని కోరాడు. 'విరాట్ కోహ్లీ.. రిటైర్‌ అయ్యేలోపు పాకిస్తాన్‌లో క్రికెట్ మ్యాచ్ ఆడు' అని కోరాడు. ఇందుకు సంబందించిన ట్వీట్ ఒకటి నెట్టింట వైరల్ అయింది. 



పాకిస్థాన్‌, భారత్ దేశాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాల కారణంగా దాయాది దేశాల మధ్య క్రికెట్ మ్యాచులు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నమెంట్ మ్యాచులలో మాత్రమే భారత్, పాక్ తలపడుతున్నాయి. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ లాంటి టోర్నీలలో మాత్రమే దాయాది దేశాలు తలపడుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితులలో విరాట్ కోహ్లీ పాకిస్తాన్‌లో ఆడడం దాదాపుగా కష్టమే. కోహ్లీ కల నెరవేరేనా మరి. 


Also Read: Ananya Nagalla Hot Pics: అనన్య నాగళ్ల హాట్ ట్రీట్.. నడుమందాలతో రచ్చచేసిందిగా!


Also Read: ట్రెండీ డ్రెస్సులో తమన్నా భాటియా.. సెగలు పుట్టిస్తున్న మిల్కీబ్యూటీ అందాలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook