Uppal Stadium: టాటా ఐపీఎల్‌ రసవత్తరమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ వర్సెస్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌కు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. మ్యాచ్‌ జరగాల్సిన ఉప్పల్‌ స్టేడియానికి అనూహ్యంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్‌ శాఖ బిల్లులు చెల్లించాలని చెబుతూ స్టేడియానికి కరెంట్‌ బంద్‌ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో క్రికెట్‌ ప్రియులు ఆందోళన చెందారు. స్టేడియానికి కరెంట్‌ బంద్‌ వార్త తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే కరెంట్‌ బంద్‌ చేసిన సమయంలో ప్రాక్టీస్‌ కోసం వచ్చిన ఆటగాళ్లు స్టేడియంలో ఉండడం గమనార్హం. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: DC Vs KKR Live Score: ఐపీఎల్‌లోనే రెండో అత్యధిక స్కోర్‌.. సునీల్‌ నరైన్‌ ఊచకోతతో కేకేఆర్‌ హ్యాట్రిక్‌ విజయం


 


జరిగింది ఇది..
హైదరాబాద్‌లోని ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం కొన్ని నెలలుగా విద్యుత్‌ బిల్లులు చెల్లిండం లేదు. నెలల తరఫున బిల్లు బకాయిలు పేరుకుపోవడంతో విద్యుత్‌ శాఖ నోటీసులు పంపింది. అయితే 15 రోజులైనా నోటీసులకు స్పందన లేకపోవడంతో గురువారం ఉప్పల్‌ స్టేడియానికి ఆ శాఖ అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉప్పల్‌ స్టేడియం నిర్వాహకులు విద్యుత్‌ బిల్లులు రూ.1.67 కోట్లు బకాయిపడ్డారు. ఆ బిల్లులు చెల్లించకుండానే విద్యుత్‌ వినియోగిస్తున్నారని విద్యుత్‌ అధికారులు ఆరోపించారు.

Also Read: RCB Vs LSG Live: బ్యాటింగ్‌తో డికాక్‌ బీభత్సం.. బెంగళూరుపై లక్నో అద్భుత విజయం


 


బిల్లులు పెండింగ్‌ ఉండడంతో వెంటనే చెల్లించాలని పలుమార్లు నోటీసులు పంపారు. కానీ హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. అంతేకాకుండా ఉప్పల్‌ స్టేడియం నిర్వాహకులపై విద్యుత్‌ దొంగతనం కేసును కూడా నమోదు చేశారు. ఈ విషయమై హబ్సీగూడ విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ రాముడు స్పందించారు. 'బిల్లులు చెల్లించకుండా విద్యుత్‌ వాడుకున్నారు. ఈ విషయమై 15 రోజుల కిందట నోటీసులు కూడా పంపించాం' అని తెలిపారు. కాగా విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో జనరేటర్‌ ద్వారా ఉప్పల్‌ స్టేడియంలో విద్యుత్‌ సరఫరా జరిగింది. 


రేపటి మ్యాచ్‌పై ఆందోళన
ఐపీఎల్‌లో శుక్రవారం అత్యంత ప్రతిష్టాత్మక మ్యాచ్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా జరుగనుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌ టికెట్లు నిమిషాల వ్యవధిలో బుకింగ్స్‌ అయ్యాయంటే ఎంతటి ఆసక్తి ఉందో అర్ధమవుతోంది. ఇలాంటి మ్యాచ్‌కు ముందు స్టేడియానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంపై క్రికెట్‌ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేపు మ్యాచ్‌లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా మ్యాచ్‌ జరుగుతుందా? అని అభిమానుల్లో సందేహం వ్యక్తమవుతోంది. విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంపై ఇప్పటివరకు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం స్పందించలేదు. చూడాలి రేపు ఏం జరుగుతుందా అనేది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి