Prithvi Shaw hits maiden first class triple hundred in Ranji Trophy: టీమిండియా యువ ఓపెనర్‌ పృథ్వీ షా అరుదైన రికార్డు సాధించాడు. పృథ్వీ షా తన తొలి ఫస్ట్‌క్లాస్ ట్రిపుల్ సెంచరీని సాధించాడు. 383 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 379 పరుగులు చేశాడు. ముంబై బ్యాటర్ తృటిలో క్వాడ్రపుల్‌ సెంచరీని మిస్ చేసుకున్నాడు. రంజీ ట్రోఫీ టోర్నీ 2022-23లో భాగంగా అసోంతో జరుగుతున్న మ్యాచ్‌లో షా ట్రిపుల్ సెంచరీ చేశాడు. రెండో రోజు ఆటలో భాగంగా షా ట్రిపుల్ సెంచరీ చేసి ఔట్ అయ్యాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

379 పరుగులు చేయడంతో రంజీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా పృథ్వీ షా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో స్టార్ కామెంటేటర్, భారత మాజీ ప్లేయర్ సంజయ్‌ మంజ్రేకర్‌ రికార్డును అధిగమించాడు. 1990-91 సీజన్లో హైదరాబాద్‌పై మంజ్రేకర్ 377 రన్స్ చేశాడు. ఈ జాబితాలో బీబీ నింబాల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 1948-49 సీజన్లో మహారాష్ట్ర బ్యాటర్ నింబాల్కర్ సౌరాష్ట్రపై 443 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. ఈ రికార్డు క్రికెట్ దిగ్గజాలు సచిన్, ధోనీ, కోహ్లీలకు కూడా సాధ్యం కాలేదు


ట్రిపుల్ సెంచరీ చేసిన పృథ్వీ షా గురించి సంజయ్‌ మంజ్రేకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పృథ్వీ షా తన అభిమాన ఆటగాడు అని, షా  తన రికార్డును బద్దలు కొట్టడం చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు. 'నా రికార్డును నేను అభిమానించే ఆటగాడు బద్దలు కొట్టడం చూసి థ్రిల్‌ అయ్యాను. వెల్‌డన్‌ పృథ్వీ షా. ఇలాంటి ఇన్నింగ్స్ మరిన్ని ఆడాలని కోరుకుంటున్నా' అని పేర్కొన్నాడు. షా భారత జట్టులోకి వచ్చి చాలా కాలమే అయింది. 


రంజీలో అత్యధిక వ్యక్తిగత పరుగుల టాప్‌-5 క్రికెటర్ల జాబితా:
# బీబీ నింబాల్కర్ (మహారాష్ట్ర) - 443 నాటౌట్ vs సౌరాష్ట్ర (1948-49)
# పృథ్వీ షా (ముంబై) - 379 vs అసోం (2022-23)
# సంజయ్ మంజ్రేకర్ (బాంబే) - 377 vsహైదరాబాద్ (1990-91)
# ఎంవీ శ్రీధర్ (హైదరాబాద్) - 366 vs ఆంధ్ర (1993-94)
# విజయ్ మర్చంట్ (బాంబే) - 359 నాటౌట్ vs మహారాష్ట్ర (1943-44)


Also Read: Best Selling SUV: అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 3 ఎస్‌యూవీ కార్లు ఇవే.. హ్యుందాయ్ క్రెటా మాత్రం లేదు!  


Also Read: Australia Test Squad: భారత్‌తో టెస్టు సిరీస్‌.. ఆస్ట్రేలియా జట్టు ఇదే! ఏకంగా నలుగురు స్పిన్నర్లు  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.