Australia Test Squad: భారత్‌తో టెస్టు సిరీస్‌.. ఆస్ట్రేలియా జట్టు ఇదే! ఏకంగా నలుగురు స్పిన్నర్లు

Australia announce Test squad for tour of India 2023. టీమిండియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు తన తాజాగా స్వ్కాడ్‌ను ప్రకటించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 11, 2023, 02:54 PM IST
  • భారత్‌తో టెస్టు సిరీస్‌
  • ఆస్ట్రేలియా జట్టు ఇదే
  • ఏకంగా నలుగురు స్పిన్నర్లు
Australia Test Squad: భారత్‌తో టెస్టు సిరీస్‌.. ఆస్ట్రేలియా జట్టు ఇదే! ఏకంగా నలుగురు స్పిన్నర్లు

Cricket Australia announce Test squad for India 2023: శ్రీలంక వన్డే సిరీస్ అనంతరం ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 2023 ఫిబ్రవరి 9 నుంచి మార్చి 22వ తేదీ వరకు టెస్టు, వన్డే సిరీస్‌లు జరుగుతాయి. నాలుగు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు తన తాజాగా స్వ్కాడ్‌ను ప్రకటించింది. ప్యాట్‌ కమిన్స్‌ నాయకత్వంలో 18 మందిని క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. దాదాపు మూడేళ్ల తర్వాత సీనియర్‌ ప్లేయర్ పీటర్ హ్యాండ్స్‌కాంబ్‌కు అవకాశం దక్కింది. 

భారత్ స్పిన్ పిచ్‌లకు స్వర్గధామం కాబట్టి.. ఆస్ట్రేలియా జట్టు ఏకంగా నాలుగు స్పిన్నర్లను టెస్ట్ జట్టులోకి ఎంపిక చేసింది. తుది జట్టులో ఇద్దరు ఆడే అవకాశం ఉంది. నాథన్‌ లియాన్‌ స్పిన్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఇక భారత్‌ జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకోవాలంటే ఈ టెస్టు సిరీస్‌ టీమిండియాకు చాలా కీలకం. ఇప్పటికే ఆసీస్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. 

తొలి టెస్టు మ్యాచ్‌ నాగ్‌పుర్ వేదికగా 2023 ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు జరుగుతుంది. రెండో టెస్టు మ్యాచ్‌ ఫిబ్రవరి 17-21 వరకు (ఢిల్లీ), మూడో టెస్టు మ్యాచ్‌ మార్చి 1-5 వరకు (ధర్మశాల), నాలుగో టెస్టు మ్యాచ్‌ మార్చి 9-13 వరకు (అహ్మదాబాద్‌)లో జరగనుంది. అనంతరం ముంబైలో మార్చి 17న మొదటి వన్డే జరుగుతుంది. మార్చి 19న విశాఖపట్నంలో రెండో వన్డే, మార్చి 22న చెన్నైలో మూడో వన్డే జరగనుంది. 

ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు:
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), అస్టన్ అగర్, స్కాట్ బొలాండ్‌, అలెక్స్ క్యారీ, కామెరూన్‌ గ్రీన్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖావాజా, మార్నస్‌ లబుషేన్‌, నాథన్‌ లియాన్‌, లాన్స్‌ మోరిస్, టాడ్‌ ముర్ఫీ, మ్యాథ్యూ రెన్‌షా, స్టీవ్‌ స్మిత్, మిచెల్ స్టార్క్‌, మిచెల్‌ స్వెప్సన్‌, డేవిడ్ వార్నర్. 

Also Read: Best Selling SUV: అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 3 ఎస్‌యూవీ కార్లు ఇవే.. హ్యుందాయ్ క్రెటా మాత్రం లేదు!  

Also Read: Chiranjeevi on AP Govt: ఏపీ ప్రభుత్వ తీరుపై చిరు స్పందన.. పవన్ కళ్యాణ్ డైలాగ్ తో ఆసక్తికర కామెంట్లు! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News